ఈ రంగుల రాయితో మీ జీవితం మారిపోతుంది.
అరుదైనది, అద్భుతమైనది! మీరు ఇప్పటివరకూ రకరకాల రాళ్లను ఉంగరాలతో ధరించి ఉంటారు.
కానీ ఈ రాయిని ట్రై చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది అరుదైన, అద్భుతమైన రాయి. దీన్ని చూస్తుంటేనే ఈ భూమిది కాకుండా మరో స్వర్గ లోకం నుంచి వచ్చినట్లుగా ఉంటుంది.
మరి దీని పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం. మీరు మీ ఉంగరంలో అరుదైన, ప్రత్యేకమైన రత్నాన్ని పెట్టుకోవాలి అనుకుంటే అలెక్సాండ్రైట్ (Alexandrite)ని పెట్టుకోవచ్చు.
దీనికి అసాధారణమైన సామర్థ్యం ఉంటుంది. ఇది తనపై పడే కాంతిని బట్టీ, రంగులు మార్చుకుంటుంది.
పగటివేళ ఇది గ్రీన్-బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. రాత్రివేళ రెడ్-పర్పుల్ కలర్‌లో కనిపిస్తుంది. అందువల్ల ఇదో ప్రత్యేక రాయిగా గుర్తింపు పొందింది.
అలెక్సాండ్రైట్ ధరించడం వల్ల కింద కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
అవేంటో తెలుసుకుందాం.
సౌభాగ్యం: అలెక్సాండ్రైట్ రాయి సౌభాగ్యం, అదృష్టాన్ని తీసుకువస్తుందని విశ్వసిస్తారు.
ఆత్మవిశ్వాసం: ఈ రాయిని ధరించడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి, కొత్త అవకాశాలను ఎదుర్కోవడానికి మనస్సు బలంగా ఉంటుంది.
భావోద్వేగ నియంత్రణ: అలెక్సాండ్రైట్ రాయి మానసిక, భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇలా అలెక్సాండ్రైట్ ధరించడం వలన మీరు వ్యక్తిగత అభివృద్ధి, సానుకూల భావనలతో ముందుకు వెళ్ళే అవకాశం పొందవచ్చు.
.jpeg)
0 Comments