GET MORE DETAILS

ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయి. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు ?

ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయి. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు ?




ఆహారం విషయంలో ఆడదోమలు, మగదోమలు రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి పళ్ల రసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే. కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది. అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్‌ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.

Post a Comment

0 Comments