GET MORE DETAILS

ఈ అలవాట్లు 10 రోజుల్లో చాలా మార్పు తెస్తాయి...

ఈ అలవాట్లు 10 రోజుల్లో చాలా మార్పు తెస్తాయి...


"నో" చెప్పడం తప్పు కాదు.. అందరిచేత మంచి అన్పించుకోవడం కోసం అందరు అడిగే సాయాలకు, డిమాండ్ చేసే నీ టైమ్కీ యెస్ చెప్పి మానసిక వత్తిడి పెంచుకోకు. నీ లైఫ్ నీది, నీకంటూ కొన్ని ప్రయారిటీలు ఉంటాయి. నీకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేయి. "నో" చెప్తే ఏం కాదు.. అది నీపై చాలా వత్తిడి తగ్గిస్తుంది.

మనుషుల వల్ల గానీ, పరిస్థితుల వల్ల గానీ, అనుకున్న పనులు అవక గానీ డిజప్పాయింట్ అవడం, ఇతర పరిష్కారం కాని ఎమోషన్స్ ప్రతీరోజూ నీలో పేరుకుపోతుంటాయి. సో అవి ఎవరితో అయినా షేర్ చేసుకో, భారం తగ్గుతుంది. ఎవరితో షేర్ చేసుకోవడానికి కుదరకపోతే ఓ డైరీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రోజూ నీకు అన్పించింది డైరీ రాయడం అలవాటు చేసుకో, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక మనిషి రోజుకి సగటున 6200 ఆలోచనలు చేస్తాడు, అంటే గంటకి 258 చొప్పున అన్నమాట. సో దీనివల్ల మైండ్ అలసిపోతుంది. అందుకే రోజుకి కనీసం ఓ 10 నిముషాలైనా ఏమీ ఆలోచించకుండా కళ్లు మూసుకుని నీతో నువ్వు గడుపు. ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని తిరస్కరించకుండా, వాటిని పట్టించుకోకుండా అలాగే  కూర్చో!

ఏ విషయమైనా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే స్వభావాన్ని తగ్గించుకో. అది ఒక్క రోజులో తగ్గకపోవచ్చు. కానీ అలవాటు చేసుకో. ఎమోషన్తో రియాక్ట్ కావడానికి బదులు కేవలం కూల్గా రెస్పాండ్ అవ్వు అంతే. ఓ మాట కోపంతో అరిస్తే అది రియాక్ట్ అవడం అన్నమాట. అదే కూల్గా సమాధానం చెబితే అది రెస్పాండ్ కావడం అన్నమాట.

Post a Comment

0 Comments