GET MORE DETAILS

చేపల వాసన వదిలేందుకు చిట్కాలు

చేపల వాసన వదిలేందుకు చిట్కాలు



చేపలను తినడానికి ఇస్టపడేవారు కూడా భరించలేని వాసన చేపలలో ఉంటుంది . చేతులతో పట్టుకున్నా , వంట చేసినా చేపల వాసన అంత త్వరగా వదలదు . ఆ వాసన వదిలించుకునేందుకు ఇంటిలోని పదార్ధాలే చాలు.

వాటిలో ముఖ్యమైనది నిమ్మ . నిమ్మ రసముతో చేతులు కడుగుకున్నా , నిమ్మ చెక్కలతో చేతులు తుడుచుకున్నా చేపలవాసన వదులుతుంది .

గిన్నెలు కడిగేందుకు ఉపయోగించే పొడిని ద్రవముగా చేసి దానికు ఒక స్పూన్‌ ఉప్పును కలిపి దానితో చేతులు కడుగుకుంటే చేపల వాసన పోతుంది.

వంటసోడా కి నీటిని కలిపి ముద్దలా తయారుచేసి ఆ ముద్దతో చేతులు కడుక్కోవాలి. వాసన పోతుంది.

సారా చేతుల మీద చల్లుకొని దానిని నీటితో కడుక్కుంటే చేపల వాసన వదులుతుంది.

Post a Comment

0 Comments