GET MORE DETAILS

అజీర్ణవ్యాధి నివారణ

 అజీర్ణవ్యాధి నివారణ




 వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.

 శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.

 ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.

 చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.

అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పొగొట్టే ఔషధాలను మొదలుపెట్టవలెను.


Post a Comment

0 Comments