GET MORE DETAILS

తాబేల్లాంటి కంప్యూటర్‌ను పరుగులు పెట్టించండిలా...!

 తాబేల్లాంటి కంప్యూటర్‌ను పరుగులు పెట్టించండిలా...!




ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆధునిక జీవనంలో ప్రతిదీ వేగంగా జరగాలి. లేదంటే ఎక్కడాలేని చిరాకు.. అలాంటిది మనంవాడే ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ ప్రతిసారి తాబేలు మాదిరి నెమ్మదిస్తే..! అబ్బో.. మౌస్‌ నెలకేసి కొట్టేంతా కోపం. పీసీ (Personal computer) నెమ్మదించడం ద్వారా చేసే పని ఆలస్యమై.. వ్యక్తిగతంగా మన పనితనంపైనే ప్రభావం పడుతుంది. అయితే, చిన్న టిప్స్‌ ఎప్పుటికప్పుడు పాటిస్తే సాధ్యమైనంతా వరకు మీ ల్యాప్‌టాప్‌ను పరుగులు పెట్టించవచ్చు. అవెంటో చూద్దాం..


‘బోగీ’లతో నింపకండి :

పని సౌలభ్యం కోసం ఇంటర్నెట్‌ బ్రౌజర్‌లో ఎక్కువ ట్యాబ్‌లు (tab’s) ఓపెన్‌ చేస్తుంటాం. ఇది సహజమే. కానీ, ఇలా వీలైనంత ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్‌ చేసి పెట్టడం వల్ల ల్యాప్‌టాప్‌ ర్యామ్‌ (RAM) ప్రాసెసర్‌పై భారం పెరిగి పీసీ నెమ్మదిస్తుందట. కాబట్టి ఖాళీగా ఉందని ట్యాబ్‌బార్‌ (tab bar) మొత్తాన్ని ‘బోగీ’లతో నింపకండి. వెంటవెంటనే ఉపయోగించే ట్యాబ్‌లను మాత్రమే అలాగే ఉంచి.. కాసేపు ఆలస్యంగా వాడే ట్యాబ్‌లను ఎప్పుటికప్పుడూ తొలగిస్తూ.. ఓపెన్‌ చేస్తూ పని పూర్తి చేసుకోండి.


‘బ్యాక్‌గ్రౌండ్‌’ మరవద్దు :

మనం వాడినా.. వాడకున్నా చాలా ప్రోగ్రామ్స్‌ సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్‌ (background programs)లో నడుస్తూనే.. ఉంటాయి. Ctrl+Shift+Esc క్లిక్‌ చేయడం వల్ల విండోస్‌ టాస్క్‌ మేనేజర్‌ (task manager)లో అవెంటో తెలుసుకోవచ్చు. అందులోని ఏ ప్రోగామ్‌ అయితే మీకు అనవసరం అనిపిస్తుందో దానిపై రైట్‌ క్లిక్ ‌(right click) చేసి ‘ఎండ్‌ టాస్క్‌’ (End Task) చేయండి.

రీఫ్రెష్‌ అవసరమే మరి :

గ్యాడ్జెట్‌ను అయినా రీస్టాట్ (Restart) చేయడం చాలు సులువు, ఉత్తమమైన మార్గం. ఇది కంప్యూటర్‌కూ వర్తిస్తుంది. సిస్టమ్‌ రీస్టాట్‌ చేయడం ద్వారా తాత్కాలిక క్యాచీ (temporary cache) క్లియర్‌ అయి సిస్టమ్‌ తాజాగా పనిచేస్తుంది. ఇక ల్యాప్‌టాప్ పనితీరు మందగించడానికి సిస్టమ్‌ అప్‌డేట్‌ చేయకపోవడమూ ఓ కారణమే. కాబట్టి క్రమం తప్పకుండా సిస్టమ్‌ అప్‌డేట్‌ చేస్తూ పీసీ పనితనాన్ని పెంచుకోండి.


గతం గతః అనుకోవద్దు : 

చాలా రోజుల కిందట డౌన్‌లోడ్‌ చేసిన కొన్ని యాప్‌లు లేదా ప్రోగ్రామ్స్ (programs) మీరు ఇప్పుడు వాడట్లేదా? అయితే, అటువంటి వాటిని అలాగే వదిలేయకుండా వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి. ఇది మీ పీసీని పరుగులు పెట్టించడంలో భాగమే.


మరిన్నీ...

మరోవైపు బ్యాక్‌ఎండ్‌లో ఓపెన్‌ అయ్యే స్టార్టప్‌ యాప్‌లు (Startup apps) మీ కంప్యూటర్‌ పనితీరుపై ప్రభావితం చూపవచ్చు. ఇందుకు Ctrl+Shift+Esc క్లిక్‌ చేసి Startup ట్యాబ్‌లో అనవసరమైన వాటిని తొలగించండి. అలాగే ఖాళీ ఉందికదా అని డెస్క్‌టాప్‌ను పెద్దమొత్తంలో ఫైల్స్‌, పోల్డర్స్‌తో నింపేయకండి. రీ-సైకిల్‌ బిన్‌ (Recycle)నూ ఎప్పటికప్పుడూ క్లియర్‌ చేయండి.

Post a Comment

0 Comments