GET MORE DETAILS

పాలు పొంగితే మోగే అలారం...! అంబర్‌పేట ప్రభుత్వపాఠశాల విద్యార్థిని ఆవిష్కరణ

 పాలు పొంగితే మోగే అలారం...! అంబర్‌పేట ప్రభుత్వపాఠశాల విద్యార్థిని ఆవిష్కరణ


400 ప్రాజెక్టుల్లో టాప్‌-4లో నిలిచిన ప్రాజెక్టు





ప్రతి ఇంట్లో పాలు వేడిచేస్తున్నప్పుడు పొంగిపోవడం, వృథా కావడం చూస్తుంటాం. ఒక్కోసారి మర్చిపోతే పాలు పొంగి, మంట పోయి గ్యాస్‌ లీకవటం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను చక్కటి పరిష్కారాన్ని చూపించింది.. హైదరాబాద్‌లోని సీపీఎల్‌ అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రూప. 9వ తరగతి చదువుతున్న రూప తన సహచర విద్యార్థులతో కలిసి ‘బాయిలింగ్‌ మిల్క్‌ ఓవర్‌ఫ్లో ప్రివెన్షన్‌ సిస్టం’ను తయారుచేసింది. ఈ వ్యవస్థను తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ ప్రశంసించింది. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 400 ప్రాజెక్టులు ప్రదర్శించగా, రూప ప్రాజెక్ట్‌ టాప్‌-4లో నిలిచింది.


పనిచేస్తుందిలా...

వాటర్‌/లిక్విడ్‌ సెన్సర్‌ను పాలు వేడిచేస్తున్న పాత్ర పైభాగంలో ఉంచాలి. ఈ సెన్సర్లను బజర్‌కు కనెక్ట్‌ చేయాలి. పాలు పొంగి సెన్సర్లను తాకగానే బజర్‌ శబ్దం చేస్తుంది. దీంతో మనం అప్రమత్తమై పాలు పొంగిపోకుండా చూసుకోవచ్చు.


వాడే పరికరాలివీ...

వాటర్‌/లిక్విడ్‌ సెన్సర్లు, బజర్‌, బ్యాటరీలు, పవర్‌ సర్క్యూట్లు

Post a Comment

0 Comments