GET MORE DETAILS

కుంకుమ, పసుపు, రవ్వ, పప్పు గింజలు ఉండే డబ్బాలను మూత పెట్టి ఉంచినా కొంత కాలానికి పురుగులు వస్తాయి. అది ఎలా సాధ్యం ?

 కుంకుమ, పసుపు, రవ్వ, పప్పు గింజలు ఉండే డబ్బాలను మూత పెట్టి ఉంచినా కొంత కాలానికి పురుగులు వస్తాయి. అది ఎలా సాధ్యం ?




వాతావరణంలో మనకు కనిపించకుండా ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. అలాగే కొన్ని జీవుల గుడ్లు కంటికి కనిపించనంత సూక్ష్మస్థాయిలో ఉండి గాలిలో తిరుగుతూ ఉంటాయి.

మనం ఇంటికి తెచ్చుకునే దినుసుల్లో ఇలాంటి గుడ్లు చేరి ఉండే అవకాశం ఉంది. మూత పెట్టి ఉంచినా వాటికి అనుకూల సమయం రాగానే ఆ గుడ్ల లోంచి పురుగులు బయటకి వస్తాయి..

ఇంటికి తెచ్చుకోక ముందు కొన్ని దినుసులు తాజాగా ఉన్నప్పటికీ ఆయా డబ్బాలను తరచూ తీసి వాడుతున్న సమయంలో సూక్ష్మజీవులు, గుడ్లు చేరే అవకాశం ఉంటుంది.

అందువల్లనే దినుసులను వండుకునేప్పుడు మాత్రమే కాకుండా తరచూ బాగు చేయడం, ఎండలో పెట్టడం వంటివి చేస్తుంటారు పెద్దలు.

Post a Comment

0 Comments