GET MORE DETAILS

ఇక జీమెయిల్ యూజర్నేమ్ మార్చుకోవచ్చు. కొత్త ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తెచ్చిన గూగుల్.

ఇక జీమెయిల్ యూజర్నేమ్ మార్చుకోవచ్చు. కొత్త ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తెచ్చిన గూగుల్.



వినియోగదారులు తమ మెయిల్ ఐడీ (యూజర్నేమ్) ని మార్చుకునే ఐచ్చికాన్ని గూగుల్ తాజాగా అందుబాటులోకి తీసుకొ చ్చింది. అవగాహన లేమి, పేర్లు అందుబా టులో లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది ఏదో ఒక యూజర్ నేమ్ తో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటారు. దాన్ని తర్వాత మార్చుకోవాలని భావించినా.. కుదిరేది కాదు. కాబట్టి దాన్ని అలాగే కొనసాగించడమో.. కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడమో చేయాల్సివచ్చేది. ఈ నేపథ్యంలో మెయిల్ ఐడీని మార్చుకునే వెసులుబాటును తాజాగా కల్పించారు. గూగుల్కు సంబంధించిన సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ దర్శనమిచ్చింది. దీని ప్రకారం.. కొత్త ఇ-మెయిల్ ఐడీని ఎంచుకున్నప్పటికీ, దాన్ని పాత అకౌంట ౯గానే గూగుల్ పరిగణిస్తుంది. అంటే పేరు మాత్రమే మారుతుందన్నమాట. చివర్లో 'జీమె యిల్. కామ్' అలాగే ఉంటుంది. ఒకసారి ఐడీ మార్చుకున్నాక మళ్లీ ఏడాది వరకూ దాన్ని మార్చుకునే వీలుండదు. మొత్తంగా మూడు సార్లు మాత్రమే ఐడీని మార్చుకోవచ్చు. ప్రస్తు తానికి కొందరికి మాత్రమే ఈ ఐచ్ఛికం అందు బాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments