GET MORE DETAILS

పెద్దలు చెప్పిన మాటలు - భారతీయ సంస్కృతి

పెద్దలు చెప్పిన మాటలు - భారతీయ సంస్కృతి




ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు ...!! 

వాటి వివరాలు తెలుసుకోండి...

👉 శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.

👉 కొంతమంది స్వయం ఠీవిగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి.

👉 తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి, తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు. అలా చేయకండి ! రెండు చేతులలోకి తుడుచుకోండి.

👉 స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని ,పూలు అయితే పైటకొంగులోనే  తీసుకోవాలి 

👉 అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి , మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కనుక చక్కగా కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి.

👉 అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు.

👉 మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు  అదే శాస్త్రం కూడా చెబుతున్నది .

Post a Comment

0 Comments