GET MORE DETAILS

ఉరిశిక్షపడ్డ ఖైదీకి పెరోల్ దొరుకుతుందా ?

 ఉరిశిక్షపడ్డ ఖైదీకి పెరోల్ దొరుకుతుందా ?బెయిల్ (Bail) అనేమాటకు సరైన తెలుగుపదం లేదు, వివరణతప్ప. హిందీభాషలోనైతే జామీను అంటారు. బెయిలు లేదా జామీను మూడురకాలుగా వున్నాయి.


(1)  రక్షకభట నిలయం ( పోలీస్ స్టేషన్) నుండి బెయిలుపొంది విడుదల కావడం, చేసిన నేరానికి ఏడుసంవత్సరాలకంటే తక్కువ శిక్షపడే అవకాశమున్న ప్రతికేసుకు పోలీసువారే బెయిలు ఇవ్వాలి. వ్యక్తిగత పూచీతో కాని లేదా ఇతరుల పూచీకత్తుపై కాని ఇటువంటి నేరాలకు పోలీసు స్టేషన్ అధికారులే బెయిలు తప్పక ఇవ్వాలి. కాని ఈ వ్యవస్థ రాజకీయనాయకుల ప్రమేయంతోనో, స్టేషన్ బెయిలు ఇస్తే ముద్దాయిలతో పోలీసులు లాలాచీపడి బెయిలు ఇచ్చారన్న అపప్రధ నుండి తప్పించుకోవాలనో ఇలాంటి కేసులలో ముద్దాయిలను న్యాయస్థానాలలో ప్రవేశపెట్టి ఇబ్బందులు పడిన సంఘటనలు కూడా వున్నాయి.


(2) బంధించబడి కారాగారంలో ముద్దాయివుంటే న్యాయ స్థానాల ద్వారా బెయిలుపొందడం. ముద్దాయి ప్రవర్తన, నేరస్వభావం, బెయిలు పొందిన తరువాత సాక్ష్యులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరని న్యాయస్థానం నమ్మితే స్వంతపూచీకత్తుపై కాని, ఇతరుల ఆస్తుల పూచీకత్తుపై కాని బెయిల్ ను జ్యూడిషియల్‌ కోర్టులు మంజూరు చేస్తాయి. ఇందులో కండీషన్ బెయిలు కూడా కొన్ని సందర్భాలలో వుండవచ్చును.గ్రామం వదలివెళ్ళరాదని, లేదా ఫలానా గ్రామాలకు వెళ్ళరాదని లేదా నిర్ణితతేదీలలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని నియమం పెట్టవచ్చును.

బెయిలు పొందిన ముద్దాయి బెయిలు షరతులు ఉల్లంఘించడం జరిగదని పోలీసులు భావించి కోర్టులో బెయిలు రద్దుకు పిటిషన్ వేయవచ్చును. లేదా ముద్దాయి ప్రవర్తన అనుమానాస్పదంగా వుందని కోర్టులునమ్మితే, అనుమానం నిజమైతే కోర్టే సుమోటోగా మంజూరు చేసిన బెయిలును రద్దు చేయవచ్చును.

(3) ముందస్తు బెయిలు. తప్పుడు, సంబంధంలేని కేసులలో పోలీసులు లేదా వ్యవస్ధలు ఒక వ్యక్తిని ఇరికించి ఇబ్బందుల పాలుచేస్తారని, చేస్తున్నారని ఆ వ్యక్తి తన మర్యాదకు భంగం వాటిల్లుతుందని భావించి సేషన్స్ కోర్టులో కాని, హైకోర్టులో కాని, లేదా దేశఉన్నత న్యాయస్థానంలో కాని తనను బంధించరాదని ( Arrest ) యాంటిసిపెరటి బెయిలుకు ధరఖాస్తు చేసుకోవచ్చును. ధరఖాస్తుదారుని వాదనలు  ఆధారాలతో నిజమని భావిస్తే పైకోర్టులు ముందస్తు బెయిలును పూచీకత్తుతో మంజూరు చేయవచ్చును. కొన్ని సందర్భాలలో Conditional  Anticipatory  Bail  కూడా మంజూరు చేయవచ్చును.

బెయిలు తీసుకొన్న వ్యక్తి / వ్యక్తులు / సంస్థలు / వ్యవస్థలు పారిపోతే, కోర్టుకు హాజరుకాకపోతే పూచికత్తుపడిన వారిదే బాధ్యత. కొన్ని సందర్భాలలో పూచీకత్తుగా ఇచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చును.

బెయిలుపొంది పారిపోయిన వ్యక్తి దొరికితే అసలుశిక్షతోపాటుగా పారిపోయినందుకు విధించబడిన శిక్షను కూడా అనుభవించాలి.


(4) పెరోల్ > శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కుటుంబంలో చావు, పెండ్లి, తీవ్రఅనారోగ్యం వంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఖైదీ సత్ప్రవర్తనబట్టి, కనీసం సంవత్సరకాలం కారాగారం శిక్ష అనుభవించివుంటే నిర్ణితరోజులు ఆఖైదీకి కోర్టులు పెరోలును ప్రిజనర్స్ యాక్ట్ 1894 & 1900 మేరకు బెయిలును మంజూరు చేస్తాయి. పేరోలు కండీషన్లు ఉల్లంఘించినా, పెరోల్ సమయంలో నేరాలు చేసినా, పెరోలు రద్దు కావడమే కాదు, ప్రాసిక్యూషన్ ఎదుర్కోవల్సి వుంటుంది.

ఉరిశిక్ష ఎదురర్కొంటున్న ఖైదీకి కూడా పై కారణాల దృష్ట్యా 14 రోజులపాటు పెరోల్ దొరికే అవకాశముంది.

దేశద్రోహం, మానభంగం, హత్య, దోపిడితోకూడిన హత్య, నార్కోటిన్ డ్రగ్, వరకట్నమరణాలు, అవినీతి ఆరోపణలు (ACB కేసులు) మొదలైన కేసులలో వున్నవారికి బెయిలు రావడం కష్టసాధ్యమనే చెప్పాలి.


For more  accurate and detailed informations about Procedures, please  go through  the  Related sections of IPC CRPC CPC IEA (Indian  Evidence  Act)


జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments