విటమిన్ డి ఉపయోగాలు _ లభించేపదార్థాలు
విటమిన్ డి ని 'సన్‌షైన్' విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
కండరాల కణాల అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రస్తుత కరోనా కాలంలో 'డి విటమిన్' పాత్ర ఎంతో కీలకం. పలు సందర్భాల్లో వైద్యులు సైతం కరోనా సోకిన వారికి డి విటమిన్ ఎంతో కీలక అని ప్రకటించారు. అందుకే చాలా మంది డి విటమిన్ ట్యాబ్లెట్స్‌ను అధికంగా తీసుకుంటున్నారు. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది అనేక జీవ ప్రక్రియలలో ప్రాముఖ పాత్ర వహిస్తుంది. కాల్షియం (calcium) గ్రహించడం, ఎముక, కండరాలు(muscle), గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది సహాయపడుతుంది. విటమిన్ డి సూర్యకాంతిలో సమృద్ధిగా దొరుకుతుంది. మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు శరీరం దీనిని గ్రహిస్తుంది.
కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. UV కాంతికి గురైనప్పుడు పుట్టగొడుగులు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి. అడవి పుట్టగొడుగులు అత్యధిక స్థాయిలో విటమిన్ డిని కలిగి ఉంటాయి. పెరటి కోళ్లు పెట్టే గుడ్లలో ఎక్కువ విటమిన్ డి ఉంటుంది. మీరు ఆహారం లేదా సూర్యకాంతి నుంచి తగినంత విటమిన్ డి పొందకపోతే తరచుగా సప్లిమెంట్లు అవసరమవుతాయి. మీరు విటమిన్ డి ఉత్పత్తిని ప్రేరేపించడానికి UV-B రేడియేషన్‌ను విడుదల చేసే లైట్లని కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే ప్రమాదకరంగా మారుతాయి.
పాలల్లో అధిక మొత్తంలో విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. ఆవు పాలలో విటమిన్ డీ ఆధిక మొత్తంలో లభిస్తుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి ఎముకలను దృఢంగా మారుస్తుంది. రోజు పెరుగు తినడం వల్ల విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు. పెరుగు ఎముకలను బలపరచడమే కాకుండా కడుపు సమస్యలను దూరం చేస్తుంది. చేపల నుంచి కూడా విటమిన్ డి పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ, బి12 కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. ఆరెంజ్ శరీరానికి విటమిన్ సి ఇవ్వడమే కాకుండా విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది.
0 Comments