GET MORE DETAILS

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించిన సర్పంచులు

రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడించిన సర్పంచులు



 ఆ 7660 కోట్లు ఏమయ్యాయో  సమాధానం చెప్పాలని మంగళగిరిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఛాంబర్ తలుపులు మూసి, గడియ పెట్టి, కమిషనర్ ని నిర్బంధించి ఘోరవ్ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్.

ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్*  అధికారులను నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వం మా  గ్రామపంచాయతీలకు పంపించిన నిధులను ఏం చేశారో  మీరు, మీ ముఖ్యమంత్రి, మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా సర్పంచులకు సమాధానం చెప్పాలని లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని  సర్పంచుల తో కలిసి కమిషనర్ గారి చాంబర్ కి గడియ పెట్టి, కమిషనర్ గారిని దాదాపు 3 గంటల సేపు ఆయన ఛాంబర్ లోనే నిర్బంధించి రాజేంద్ర ప్రసాద్ మరియు సర్పంచులు  ధర్నా చేశారు. తదుపరి

 రాజేంద్ర ప్రసాద్ ని, సర్పంచులను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు సర్పంచ్లకు, పోలీసులకు జరిగిన పెనుగులాట, తోపులాట, వాగ్వాదం  తర్వాత బలవంతంగా రాజేంద్రప్రసాద్ గార్ని, సర్పంచులను  సుమారు 50 మంది పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లడం జరిగింది. తదుపరి స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమం లో పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు,సర్పంచుల సంఘం నాయకులు  బిర్రు ప్రతాప్ రెడ్డి,  వినోద్ రాజు, అనేపు  రామకృష్ణ నాయుడు,  చుక్క ధనుంజయ్ యాదవ్, ఎండి ఇస్మాయిల్, రంగయ్య, మానం విజేత,  గోగినేని వసుధ, మీనాక్షి నాయుడు, ప్రతాప్ నాయుడు,  మూడే శివ శంకర్,  వీరేష్, కనగాల మధు, కడలి గోపాలరావు తదితర సర్పంచ్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments