GET MORE DETAILS

చాలావాటికి సమాధానాలు ప్రశ్నలలోనేవున్నాయి, వెతికి తెలుసుకొని చెప్పడమే...

చాలావాటికి సమాధానాలు ప్రశ్నలలోనేవున్నాయి, వెతికి తెలుసుకొని చెప్పడమే...



(1) పంచముఖ ఆంజనేయుడంటే ఐదు ముఖాలు కలవాడని అర్థం కదా ! అవేవంటే  (1) నరసింహవతారంలోనిది (2) వరహావతారంలోనిది (3) హయగ్రీవం (4) గరుడ మరి ఐదవదేది. మీకు తెలుసు. ఆలోచించండి.


జ॥ ఆంజనేయుడే కదా !


(2) మైరావణుడు (మహిరావణుడు) శ్రీరామలక్ష్మణులను అపహరించి పాతాళంలో దాస్తాడు. హనుమ పాతాళంలో ప్రవేశించి మైరావణుడి ప్రాణాలను హరిస్తాడు. ఎలా ? ఆధారం (క్లూ) వచ్చే దీపావళిలోవుంది.


జ॥ దీపావళి


(3) ఆంజనేయుడు పాతాళ ప్రవేశాన్ని అడ్డగించి ధ్వజమెత్తినవాడెవరు ?  ప్రశ్నలోనే సగం సమాధానముంది.


జ॥ మకరధ్వజుడు


(4) రావణుడికి మైరావణుడికి గల సంబంధమేమిటో  ? మీ మా నసులోనే వుంది. ?


జ॥ మామ


(5) నా మిత్రుడు కొద్దిగా కోతిముఖంతో వుంటాడులేండి ఒకసారి హనుమ అని పిలిచాను, కోపించి దవడ పగులగొట్టాడా సన్యాసి.కొడితే కొట్టాడు కాని హనుమంటే ఏమిటో నాకు తెలీదు.మీరైనా కాస్తా చెబుతారా ? ఏమిటి ఆధారమా ! ప్రశ్నలోనే వెతుక్కోండి.


జ॥ దవడ


(6) పరవస్తుచిన్నయసూరి గొప్ప వ్యాకరణవేత్త, పండితుడు, గ్రంథకర్త, ఏకసంధాగ్రాహి, స్ఫూరదృపి కదా ! మరి ఆంజనేయస్వామి వీటిలో ఏమిటిలో ప్రసిద్ధి ? సమాధానం ప్రశ్నలోనేవుంది వెతుకోవాల్సిందే! తప్పదు.


జ॥ వ్యాకరణవేత్త


(7) లంకకు బయలుదేరిన శ్రీరాముడి సేనలు భూమి నీలాకాశాన్ని దద్దరిల్ల చేసేలావుందని అడవిలోని సింహ, వ్యాఘ్ర,  నృకోదర, భల్లూకాలు భయపడిపోయాయి. మీకేమైనా తెలుసా ఆ సైన్యం ఎవరి ఆధ్వర్యంలో దక్షిణదిక్కుగా బయలుదేరిందో ? జవాబు ప్రశ్నలో కనబడుతుందిగాని, కొంచెం కష్టమే మరి .


జ॥ నీలుడు


(8) నీకు నాకు శత్రుత్వంలేదు కనుక నా మాటవిని రాముడి పక్షాన్ని వదలిరమ్మని రావణుడు శుకుడనేవాడిచేత రాయభారం పంపుతాడు. శుకుడు  శ్రీరామస్కందావారాన్ని (సైనికశిబిరం) చేరి ఒక యోధుడిపై వాలి ఆలింగనం చేసుకొంటాడు.  ఎవరా యోధుడు ? సమాధానం ప్రశ్నలో వుందంటారా ?


(అ) హనుమ

(ఆ) నీలుడు

(ఇ) వాలి

(ఈ) సుగ్రీవుడు

(ఉ) జాంబవంతుడు


జ॥ సుగ్రీవుడు


(9) వానరాలు  ఎవరి ఆధ్వర్యంలో జలధిపై  సేతునిర్మాణం చేపట్టాయి ?


(అ) నీలుడు

(ఆ) నలుడు

(ఇ) జాంబవంతుడు

(ఈ) లక్ష్మణుడు

(ఉ) విభీషణుడు


జ॥ నలుడు


(10) లంకానగరం ఏ పర్వతంపై నిర్మించివుంది ? కొలువు కూటములోనున్న  త్రి జటనడిగితే సరిపోతుంది. సమాధానం ప్రశ్నలోనే వెనుకాముందు వుంది. వెతికి పట్టుకోండి మరి !


జ॥ త్రికూటపర్వతం


జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments