భారతీయ కర్మసిద్ధాంతం
* ఈరోజు నీ ఏడుపుకి కారణం ఏనాడో నీ వలన ఏడ్చిన వారి శాపమే.
* ఈరోజు నీ నవ్వుకి కారణం ఏ నాడో నీ వలన నవ్విన వారి దీవెనే.
* ఈ రోజు అవమానానికి కారణం ఏనాడో నీ వలన అవమానింపబడిన వారి మానసిక క్షోభ యే.
* ఈ నాటి నీ సన్మానానికి కారణం ఏ నాడో నీవు చేసిన సన్మానానికి బహుమానమే.
* నీ విషయ లోలత్వమే నిన్ను మతి విభ్రమమానికి గురిచేస్తుంది.
* నాడు నీవు ధర్మానికి చేసిన నిరాదరణమే నేడు నీకు దక్కిన నిర్దయా ఫలం.
* నాడు నీవు పెద్దల పట్ల చూపిన దాస్టీకమే నేడు నీకు పిల్లల చేత దక్కిన దైన్య స్థితి.
* కర్మ ఒక చక్రం వంటిది. అది తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరకే వస్తుంది.
* ఎక్కడి వారైనా, ఎంతటి వారైనా సరే కర్మపాశం విసిరే వలలో చిక్కవలసిందే.
* సనాతనం సనూతనం సదాతనం మన భారతీయ కర్మ సిద్ధాంతం.
0 Comments