పండ్లు అమ్మే వ్యక్తిని వరించిన పద్మశ్రీ అవార్డు
మంగళూరు సమీపంలోని హరెకాళ అనే గ్రామానికి చెందిన 65 ఏళ్ళ హాజప్ప అనే వ్యక్తి ప్రతిరోజూ తన గ్రామం నుంచి బత్తాయి పండ్లను తెచ్చి మంగళూరులో అమ్ముకుని తిరిగి సాయంకాలానికి ఇళ్ళు చేరుతారు.
ఈవిధంగా ఆయన గత 55 ఏళ్ళుగా చేస్తున్నారు. అంటే తన 10వ ఏట నుండి ఆయన ఇలా పండ్లు అమ్ముతున్నారు..
ఇంత అనుభవం ఉండడంతో ఆయన పండ్ల వ్యాపారంలో తనకు వచ్చే ఆదాయాన్ని వెచ్చించి వారి గ్రామంలో ఒక పాఠశాల నిర్మించి, ఉపాధ్యాయులను కూడా తన ఖర్చుతోనే ఏర్పాటుచేసి పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు.
ఎందుకంటే తనకు చదువుకోవాలని కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువుకోలేకపోయాడు. పేదరికం కారణంగా 10వ ఏట నుంచే ఆయన పండ్లు అమ్మి కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది.
తనలాగా పేదవాళ్ళు చదువులేనివారిగా మిగిలిపోకూడదని ఆయన సంపాదించినదంతా స్కూలు కోసం ఖర్చుపెడుతున్నారు.
ఆయన సేవలను గుర్తించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ 2020 అవార్డు ప్రకటించింది.. ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన తన అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు.
0 Comments