GET MORE DETAILS

తోక చుక్కలకి రాజు : : (నేడు హేలి జయంతి)

 తోక చుక్కలకి రాజు : : (నేడు హేలి జయంతి)




15వ శతాబ్దం వరకు ఆకాశంలో ఏ వింత జరిగినా అది దైవ మహిమ అని నమ్మేవారు. అంతకుముందు కూడా ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందినా, గెలిలియో ఈ శాస్త్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన గ్రహాలపై చేసిన పరిశోధనలు ఆధునిక ఖగోళ శాస్త్రానికి గట్టి పునాదులు వేశాయి.మతోన్మాదుల దాడులకు ఎదురొడ్డి ఆయన చేసిన పోరాటం తరువాత అంతరిక్షం గురించి పరిశోధన చేసిన శాస్త్ర వేత్తలకు స్ఫూర్తి నిచ్చింది.

తోకచుక్కల గురించి కూడా ప్రజలలో కొన్ని విశ్వాసాలు ఉండేవి.మహనీయులు పుట్టుకకు సంకేతంగా తోకచుక్క  కన్పించడాన్ని భావించేవారు.మరికొన్ని ప్రాంతాల్లో చెడుకు సంకేతంగా భావించేవారు.ఇదొక ఖగోళ ప్రక్రియేనని అనేక మంది శాస్త్ర వేత్తలు వివరించారు. అందులో హేలి ఒకరు.

ఎడ్మండ్‌ హేలీ 1656, నవంబరు 8న లండన్‌కు దగ్గర్లోని హగర్‌స్టన్‌లో జన్మించాడు. తండ్రి లండన్‌లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. లండన్‌లోని సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌లో చదివిన హేలీ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ లోని క్వీన్‌ కాలేజీలో చేరారు. కాలేజీలో చేరేటప్పటికే హేలీకి ఖగోళశాస్త్రం పట్ల ఆసక్తి పెరిగింది. 19 ఏళ్లకే కెప్లర్‌ సూత్రాలపై పుస్తకాన్ని ప్రచురించారు. ఈ గ్రంథాన్ని చూసిన బ్రిటన్‌ రాజాస్ధాన్‌ ఖగోళ శాస్త్రవేత్త జూన్‌ ప్లామ్‌ స్టీడ్‌ ముచ్చటపడి హేలీని ప్రోత్సహించారు. అప్పటికే పురాతన గ్రీకు నక్షత్ర కేటాలాగుల తప్పులు వెలుగు చూశాయి.కొత్తవాటి ఆవశ్యకత స్పష్టంగా కన్పించింది. ఈ నేపథ్యంలో ప్లామ్‌స్టీడ్‌ తదితరులు ఉత్తరార్ధ గోళంలో నక్షత్రాలపై పరిశోధనలు చేస్తుండటంతో హేలీ దక్షిణార్ధ గోళం వైపు మళ్ళించారు. కానీ అదెంతో ఖర్చుతో కూడు కున్నదే కాకుండా, వాతావరణ పరంగా కూడా ప్రతికూల మైంది. అయినా హేలీ వెరవలేదు. ప్రయాణ ఖర్చులు భరించేలా ఎలాగోలా తండ్రిని ఒప్పించాడు. చదువును మధ్యలోనే ఆపివేసి 1676లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఓడలో ఆఫ్రికాలోని సెయింట్‌ హెలేనా ద్వీపానికి బయల్దే రాడు. నక్షత్రాన్వేషణ ప్రారంభించాడు.దాదాపు రెండేళ్ళ పాటు ఆ ఓడే ఇల్లయింది. ఈ నేపథ్యంలో వాతావరణం ఇబ్బంది పెట్టింది. అంతరిక్ష పరిశోధనకు అంతవీలుగా లేకపోవడంతో పాటు హేలీ ఆరోగ్యం కూడా దెబ్బతింది. అయినా వెరవకుండా వైజ్ఞానికాన్వేషణను కొనసాగిం చాడు. అప్పటిదాకా శాస్త్రవేత్తల పుటల్లో కెక్కని కొత్తనక్ష త్రాల జాబితాతో రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టాడు. దక్షిణార్ధ గోళంలో ఈ 341 నక్షత్రాల స్ధానాన్ని, తన పరిశోధన వివరాల్ని గుదిగుచ్చుతూ 1679లో 'కెటలాగ్‌'ను ప్రచురించాడు. దీంతో ఖగోళ శాస్త్ర రంగంలో హేలీపేరు మారుమ్రోగిపోయింది. లండన్‌లోని ప్రముఖ శాస్త్రవేత్తల పేర్ల సరసన డిగ్రీ కూడా పూర్తి చేయని కుర్రాడి పేరు చేరి పోయింది. ప్రతిష్టాత్మక రాయల్‌ సొసైటీ హేలీని ఆహ్వానించి సభ్యత్వమిచ్చి గౌరవించింది. కానీ పరీక్షలు రాయక పోవటం ఇతరత్రా నిబంధనల్ని పూర్తి చేయక పోవడంతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీ మాత్రం హేలీకి డిగ్రీ ఇచ్చేందుకు నిరాక రించింది. చివరకు రాజు రెండో చార్లెస్‌ జోక్యం చేసుకుని సిఫార్సు చేయడంతో హేలీకి ఎం.ఎ డిగ్రీ ప్రదానం చేశారు. అదే రోజు రాయల్‌ సొసైటీ సభ్యత్వం లభిం చింది. దీంతో 22 ఏళ్ల హేలీకి ఐజాక్‌ న్యూటన్‌, రాబర్డ్‌ హుక్‌, ఫ్లామ్‌స్టీడ్‌, క్రిస్టోఫర్‌వ్రెన్‌ లాంటి మహామహుల సరసన కూర్చునే అవకాశం లభించింది. గణిత శాస్త్రంలో విప్లవంగా చెప్పే 'ప్రిన్సిపియా'ను ముంద్రించేందుకు న్యూటన్‌ను ప్రోత్సహించటమే కాకుండా, అందుకు తన జేబు నుంచి ఇతోధికంగా ఆర్ధిక సాయం కూడా చేశారు హేలీ. ఆ విధంగా ప్రపంచ చరిత్రలో ఓ మహాగ్రంథం వెలుగు చూసేందుకు కారకుడయ్యారు. సముద్రంలో ఉన్నప్పుడు వాతావరణ మార్పులు, గాలివాటం, రుతుపవ నాలు, సముద్రపు నీరు ఆవిరికావటం తదితర అంశాలకు సంబంధించి కూడా సేకరించిన సమాచారాన్ని ఏర్చికూర్చి 1686లో ఒక పటాన్ని ప్రచురించారు. అదే ప్రపంచంలో తొలి 'మెట్రోలాజికల్‌ ఛార్ట్‌', ప్రస్తుతం టెలివిజన్‌లో 'వాతావరణ' సమాచారం ఇచ్చే వివరాలకు ఆద్యుడు ఒకరకంగా హేలీయే! ఇంగ్లాండ్‌ రాజు హేలీ సారధ్యంలో ఒక బృందాన్ని సముద్రయానానికి పంపించారు.వైజ్ఞానిక అవసరాల కోసం బయల్దేరిన తొలి బృందం అది. దాదాపు రెండేళ్ల పాటు దక్షణ అట్లాం టిక్‌, పసిఫిక్‌ సముద్ర ప్రాంతాల్లో హేలీ పరిశోధనలు జరిపారు. 1701లో వివిధ నౌకా కేంద్రాలు అక్షాంశ, రేఖాంశాల్ని కచ్చితంగా గుర్తిస్తూ, అంట్లాంటిక్‌, పసిఫిక్‌ ప్రాంతాలు అయస్కాంత ఛార్టుల్ని రూపొందించారు. ఇవన్నీ ఎడ్మండ్‌ హేలీని భూభౌతిక శాస్త్ర పితా మహుడిగా నిలిపాయి. చాలా ఆలస్యంగానే అయినా రాయల్‌ సొసైటీ 1957లో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాకుండా అంటార్కిటికాలోని తమ శాశ్వత స్ధావరానికి 'హేలీబే' అని పేరు పెట్టారు. కేవలం ఈ పరిశోధనలే కాకుండా తన గణిత ప్రతిభనుపయోగించి బైస్లాహు పట్టణానికి సంబంధించి మరణాల సంఖ్యా పట్టికలను రూపొందించి ఇచ్చాడు. జనన మరణాల రేటుకు, ఆయుష్కాలం లెక్కలకు ఉపయోగపడే తొలి పరిశోధన ఇదే. ఇవన్నీ చేస్తున్నా తనకిష్టమైన ఖగోళ పరిశోధనల్ని మాత్రం హేలీ విడిచి పెట్టలేదు. నక్షత్రాలు, తోక చుక్కల పాత రికార్డులను శోధిస్తుంటే అనేక నక్షత్రాల స్ధానం మారుతూ వస్తోందని హేలీ గుర్తించారు. అన్నింటికీ మించి హేలీని ఆశ్చర్య పర్చాయి మూడు తోక చుక్కలు. 1531, 1607, 1682ల్లో కన్పించిన తోక చుక్కలు గమనాల్లో తోకచుక్కని హేలీ ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాకుండా ఇది క్రమం తప్పకుండా ప్రతి 76 లేదా 77 ఏళ్లకోసారి భూమికి దగ్గరగా వెళుతుంది. మామూలు కంటికి కన్పిస్తుందని ప్రకటించారు. మళ్ళీ ఇది 1757లో వస్తుందని జోస్యం చెప్పారు. హేలీ ఊహించినట్లే ఈ తోకచుక్క 1757లో దర్శన మిచ్చింది. కానీ తాను చెప్పిన మాట ప్రకారం వచ్చిన తోకచుక్క చూసుకోవడానికి హేలీ లేకుండా1742 జనవరి 14న గుండె పోటుతో మరణించారు. ఇటీవల 1986లో కన్పించిన తోకచుక్క హేలీ. తోకచుక్కే హేలీ పేరు వినగానే ఈ తోకచుక్కే గుర్తుకు వస్తుంది. కానీ ఆయన పరిశోధనల్లో అదొక ప్రధానాంశం మాత్రమే. దీర్ఘ వృత్తాకారంగా తోకచుక్కలు నిర్ధిష్ట కక్ష్యలో తిరుగుతుంటాయని హేలీ స్పష్టం చేశారు. సూర్యుడికి - భూమికి మధ్య దూరాన్ని కొలిచేందుకు మార్గదర్శనం చేశారు హేలీ. సూర్యడి చుట్టూ శుక్రుని గమనాన్ని కొన్ని అరుదైన సందర్భాల్లో గమనించటం ద్వారా భూమికి - సూర్యడికి మధ్య దురాన్ని అంచనా వేయవచ్చని అరుదైన సందర్భాలలో పేర్కొన్నారు. 1769లో ఈ మేరకు చేసిన లెక్కలు ఆధారంగా ఈ దూరాన్ని 93 మిలియన్‌ మైళ్ళుగా అంచనా వేశారు. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్న అంచనా కాస్త అటూ ఇటూగా ఇంతే! ఈ విధంగా కూడా హేలీ పేరు చరిత్ర పుటల్లో కెక్కింది. హేలీ అంటే గిట్టని శాస్త్రవేత్తల కారణంగా కొన్ని పదవులు హేలీకి అందకుండా పోయినా చివరకు అవే వెతుక్కుంటూ వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీ ప్రొఫెసర్‌ పదవి, ఇంగ్లాండ్‌ రాజాస్ధాన ఖగోళ శాస్త్రవేత్త పదవి కూడా హేలీ పొందారు. ఏదిఏమైనా ఖగోళ శాస్త్రంలో హేలీ పరిశోధనలు ప్రఖ్యాతిగాంచాయి.

ఇప్పటికీ కూడా అనేకమంది గ్రహగతుల గురించి వివిధ రకాల విశ్వాసాలు కలిగివున్నారు.కుజ దోషం ఉందని నమ్ముతారు.గ్రహాలు మనుషులను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు.ఇందుకు ప్రధాన కారణం తరతరాలుగా విశ్వాసాలు వారసత్వ సంపద గా మనకు రావడమే అని చెప్పవచ్చు.

Post a Comment

0 Comments