GET MORE DETAILS

పితృ దేవతల ఆశీర్వచనం కోసం ఏ నక్షత్రం నాడు అమ్మానాన్నలను/కాలం చేసిన పెద్దలను పూజిస్తే ఏ ఫలం దక్కుతుంది.

పితృ దేవతల ఆశీర్వచనం కోసం ఏ నక్షత్రం నాడు అమ్మానాన్నలను/కాలం చేసిన పెద్దలను పూజిస్తే ఏ ఫలం దక్కుతుంది.
 అశ్విని : వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.


భరణి : ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.


కృత్తిక : అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.


రోహిణి : సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.


మృగశిర : బ్రహ్మతేజస్సు కలుగుతుంది.


ఆర్ద్ర : శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.


పునర్వసు : ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.


పుష్యమి : తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.


ఆశ్రేష : ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.


మఖ : తన దాయాదులలో మేటి కావాలనుకున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.


పుబ్బ : పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.


ఉత్తర : సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.


హస్త : తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.


చిత్త : అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు  అనేకం కలుగుతారు.


స్వాతి : వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)


విశాఖ : స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.


అనూరాధ : రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.


జ్యేష్ఠ : సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.


మూల : ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు  మ్రొక్కాలి.


పూర్వాషాఢ : సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.


ఉత్తరాషాఢ : నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.


శ్రవణం : బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.

 

ధనిష్ఠ : రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది. 


శతభిషం : వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు. 


పూర్వాభాద్ర : మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని తెలుసుకోవాలి.


ఉత్తరాభాద్ర : గోసంపద వృద్ధి అవుతుంది.


రేవతి : వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.


Post a Comment

0 Comments