మంత్ర పుష్పం - భావగానం - మంత్రపుష్పం విశిష్టత
హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక పుష్పం ఇచ్చి వేదం లోని మంత్రపుష్పం చదువు తారు. ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి గర్భగుడి లోని దైవానికి సమర్పిస్తారు . వేదం లో భాగమైనది
మంత్ర పుష్పం :
ఇది దైవం గురించి ఆయాన విశిష్టతను తెలుపు తుంది. మంత్ర పుష్పం మొత్తం 34 శ్లోకముల దైవ తత్వ మంత్రరాజము.
మంత్ర పుష్పం - 1
ఓం ధాతా పురస్తాద్య ముదా జహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః
తమేవం విద్వానమృతమిహ భవతి
నాన్యః పంథా అయనాయ విద్యతే
భావ గానం :
అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి
ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి
ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి
అదే అందరికి అమృత మార్గమ నోయి
వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి.
మంత్ర పుష్పం - 2
సహస్ర శీర్షం దేవం
విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవం
అక్షరం పరమం పదం
భావ గానం :
అంతటా తలలున్న దేవమోయి
అంతటా కనులున్న దైవమోయి
అన్ని లోకాల శుభ దైవమోయి
విశ్వమంతానిండిన దైవమోయి
నశించని నారాయణుడోయి
ముక్తి నీయు పరంధాముడోయి.
మంత్రపుష్పం విశిష్టత
వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం' ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, 'యోపాం పుష్పం వేద' ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి.
మననం చేసేవాణ్ణి రక్షించేది మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవున్ని పూజిస్తాము. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమనీ లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమనీ రెండు విధాల అర్ధాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చును.
ధ్యానం, ఆవాహనం, మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి.
దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది. మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.
‘‘మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడు: అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది. ’
చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.
మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.
మంత్రపుష్పం ఎందుకు చదువుతారంటే...
పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం. మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.
‘‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’’
చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.
మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి నేను, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి.
0 Comments