GET MORE DETAILS

వేప చెట్టు రాత్రి, పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని విన్నాను. నిజమేనా ?

 వేప చెట్టు రాత్రి, పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని విన్నాను. నిజమేనా ?




సాధారణంగా ఏ హరిత వర్ణ వృక్షజాతి (green plant) అయినా పగటిపూట గాలిలోని కార్బన్‌డయాక్సైడు, నేల నుంచి నీటిని తీసుకుని కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ (photosynthesis) జరుపుతుంది. ఆ క్రమంలో పిండి పదార్థ రూపమైన చక్కెరతో పాటు ప్రాణవాయువును కూడా విడుదల చేస్తుంది. రాత్రి వేళ చీకట్లో కాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఇందుకు వేపచెట్టు కూడా మినహాయింపు కాదు. రాత్రిళ్లు కూడా చెట్లు ఈ క్రియను జరుపుతాయనడం చాలా అరుదైన విషయం. కేవలం కొన్ని నిమ్న స్థాయి వృక్షజాతులు నక్షత్రకాంతిని, చంద్రకాంతిని కూడా గ్రహించి మంద్రస్థాయిలో కిరణజన్య సంయోగ క్రియను జరిపినా అవి విడుదల చేసే కార్బన్‌డయాక్సైడే ఎక్కువ.

Post a Comment

0 Comments