GET MORE DETAILS

ప్రపంచంలో మొదటి రైలుప్రమాదం ఎక్కడ జరిగింది ?చనిపోయినదెవరు ?

 ప్రపంచంలో మొదటి రైలుప్రమాదం  ఎక్కడ జరిగింది ?చనిపోయినదెవరు ?
జార్జి  స్టిఫెన్ సన్ లివర్ ఫూల్‌ నుండి మాంచెస్టర్ వరకు రైల్వేమార్గాన్ని నిర్మించగానే అతనికి ఆ ఇనుపదారిలో రైలు నడపటానికి అనుమతులు అంత సులభంగా  రాలేదు. ఎందుకంటే జార్జి  స్టిఫెన్ సన్ తోపాటుగా మరో నలుగురు కూడా ఆవిరితో నడిచే రైళ్ళయంత్రాలను కనుక్కొన్నారు. అనుమతులు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై వాదోపవాదాలు జరిగి, చివరికి పోటీపరీక్షలో ఏ యంత్రం నిలబడుతుందో దానినే అనుమతించాలని బ్రిటన్ పార్లమెంటు నిర్ణయించింది. తేదీలకై తేదీని ఖరారుచేసింది. పోటీ రెండురోజులుగా నిర్ణయించారు. ఈ రెండురోజులలో కూడా యంత్రనిర్మాతలు తమ యంత్రాలను నడపాల్సివుంటుంది.

జార్జిస్టిఫెన్ సన్ గడువులోగా ఇంకామంచి ఆవిరి యంత్రాన్ని తయారుచేసేపనిలో పడ్డాడు. 1829 అక్టోబరులో పోటీని నిర్వహించారు.మొత్తం ఐదు నమూనాలు పోటీలో నిలబడ్డాయి. పోటీకి ఐదు నమూనాలు రావడమంటే అది బ్రిటన్ సాధించిన సాంకేతికాభివృద్ధికి సూచన అనుకోవాలి. 

జార్జి  స్టిఫెన్ సన్  రైలుయంత్రం పేరు రాకెట్.పోటీలో చివరి వరకు నిలబడిన మిగిలిన వాటిపేర్లు నావల్టి, సాన్ స్పరిల్, పర్సివరెన్స్.

పోటి ప్రారంభానికి ముందుగా రైల్‌ యంత్రాలను పరిశీలించడం జరిగింది. ఐదుంటిలో ఒకదాంట్లో గుర్రంవుందని అనర్హత ప్రకటించారు. పోటీలో నాలుగు మిగిలాయి.

ఈ పోటిని, వింతను గమనించటానికి ప్రజలు వేలాదిగా గుమిగూడారు.

పోటీ ప్రారంభమైంది. ఇనుపదారి ఒకటే కనుక ఒకదాని తరువాత మరొకటి అనుమతించారు. పోటీప్రారంభం కాగానే రాకెట్ 13 1/2 మైళ్ళవేగంతో పరిగెత్తింది. తరువాత నావల్టి 27 మైళ్ళవేగంతో ప్రయాణించి అందరిని అశ్చర్యచకితులను చేసింది. ప్రారంభంలోనే సాన్ స్పరిల్  యొక్క ఆవిరికుండ (బాయిలర్) లో లోపం ఏర్పడి చతికిలపడింది. పర్సిపరెన్స్ వేగం ఆరుమైళ్ళకంటే మించలేదు. రెండోరోజున పోటీకి స్టిఫెన్ సన్ నిర్మించిన రాకెట్, నావెల్టిలు మాత్రమే మిగిలాయి. పోటిరోజు సాయంత్రం మరమ్మత్తుకు వెళ్లిన నావెల్టి మరుసటిరోజు పోటికి రాలేకపోయింది. ఎందుకంటే యంత్రం చెడిపోయింది.

మరుసటిరోజున రాకెట్ విశ్వరూపం చూపింది. 13 టన్నుల బరువును లాగుతూ 15మైళ్ళ వేగంతో ఇరవైసార్లు అటుఇటు పరుగులు తీసింది. కడపటన 29మైళ్ళ వేగంతో ప్రయాణించింది. బరువులు లేనప్పుడు 35 మైళ్ళ వేగంతో రాకెట్ పరుగులు తీసింది. ఇలా 35 మైళ్ళవేగంతో రైలు ప్రయాణించడం చూసిన నిర్వాహకులు ప్రేక్షకులు భయపడ్డారు. యంత్రాన్ని నడిపేచోదకుడు చనిపోయినందున యంత్రం అదుపు తప్పిందని భావించారు కాని. రైల్వేయంత్రాన్ని ఆపి చోదకుడు కిందకు దిగగానే అందరూ హర్షద్వానాలు చేసారు. ఇంతకు ఆ ఆవిరితో నడిచే రైలు యంత్రాన్ని నడిపిందెవరో చెప్పలేదు. అతనే రాబర్ట్. స్టీఫెన్ సన్ యొక్క కొడుకు.

 జనం కేరింతలమధ్య రాకెట్ ను విజేతగా పోటీ నిర్వాహకులు ప్రకటించారు.

1830 సెప్టెంబరు 15వ తేదీన లివర్ ఫూల్ > మాంచెస్టర్ రైలు ప్రారంభించబడింది. దురదృష్టవశాత్తు మొదటి రైలు ప్రమాదం కూడా ఆనాడే జరిగింది. రైల్వే బిల్లుకు, జార్జి స్టిఫెన్ సన్ కు మద్దతు తెలిపిన లివర్ ఫూల్ పార్లమెంటు సభ్యుడైన విలియం పొరబాటున రాకెట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్టిఫెన్ సన్ నిర్మించిన మరో రైలులో  గాయపడిన  విలియంను వైద్యశాలకు తరలించారు. కాని ప్రయోజనం లేకపోయింది. విలియం మరణించాడు.

ప్రపంచంలో రైలు ప్రమాదంలో తొలిసారిగా మరణించిన వ్యక్తిగా విలియం నిలిచిపోయాడు.


మిత్రులారా !

 సంయుక్తాంధ్రప్రదేశ్ లో మొదటిగా రైలుప్రమాదం ధర్మవరం > హిందూపురం స్టేషన్ల మధ్యగల ఓ రైల్ స్టేషన్లో జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న ఇనుపదారికి  స్లీపర్లు తీసుకువెళుతున్న గూడ్స్ బండి ప్రమాదానికి గురై ఇంజిన్ డ్రైవర్ మరణించడం జరిగింది. 

Post a Comment

0 Comments