GET MORE DETAILS

Google Account: నవంబరు 9 నుంచి గూగుల్ ఖాతా లాగిన్‌ కావాలంటే.. ఈ పని చేయాల్సిందే...!

Google Account: నవంబరు 9 నుంచి గూగుల్ ఖాతా లాగిన్‌ కావాలంటే.. ఈ పని చేయాల్సిందే...! 




సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతుండటంతో యూజర్స్‌కి  సురక్షితమైన సేవలను అందించేందుకు టెక్ కంపెనీలు పటిష్ఠమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ యూజర్స్‌ ఇకమీదట తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు రెండు దశల ధృవీకరణను (2 Step Verification or 2SV - టూ స్టెప్ వెరిఫికేషన్) తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి గూగుల్ ఈ ఏడాది మేలో కీలక ప్రకటన చేసింది. తాజాగా నవంబరు 9 నుంచి యూజర్స్‌ తమ ఖాతాలలోకి లాగిన్ కావాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్‌ తప్పనిసరి కానుంది. ‘‘2021 చివరికల్లా 150 మిలియన్‌ గూగుల్ యూజర్స్‌, 2 మిలియన్ల యూట్యూబ్‌ యూజర్స్‌ ఈ ఫీచర్‌ను తప్పక ఉపయోగించాల్సిందే’’ అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. 


ఏంటీ టూ స్టెప్‌ వెరిఫికేషన్ ‌?


ఇప్పటికే చాలా మంది యూజర్స్ ఈ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను ఉపయోగిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్‌ ఖాతాలకు రక్షణ కల్పించడంలో భాగంగా గూగుల్ అందిస్తున్న రక్షణ కవచంగా దీన్ని చెప్పుకోవచ్చు. యూజర్స్‌ తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేప్పుడు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ యాక్టివేట్ చేయమని గూగుల్ సూచిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ ఫోన్ లేదా ఈ-మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్నిటైప్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది. ఒకవేళ నవంబరు 9లోపు యూజర్స్‌ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయకుంటే తర్వాత ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుందని గూగుల్ తెలిపింది. 


ఎలా ఎనేబుల్ చేయాలంటే ?


మీ జీమెయిల్ ఐడీతో గూగుల్ లాగిన్‌ చేసిన తర్వాత కుడివైపు మీ పేరు లేదా ఫొటో ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయాలి. 

అందులో మేనేజ్‌ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌ ఓపెన్ అవుతాయి.

వాటిలో సెక్యూరిటీ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే టూ స్టెప్‌ వెరిఫికేషన్ ఫీచర్‌ కనిపిస్తుంది.

అక్కడ మీకు ఆఫ్ అని కనిపిస్తుంటే దానిపై క్లిక్‌ చేస్తే వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కొనసాగించమని కోరుతుంది.

తర్వాత మీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. అది టైప్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది.

Post a Comment

0 Comments