Petrol Prices ఊరటలో వాస్తవమెంత ? పెట్రోల్, డీజిల్‌పై మూడు రెట్లు పెరిగిన పన్నులు
మూడేళ్లలో రూ.8 లక్షల కోట్లు వసూళ్ళు :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గద్దెనెక్కినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు అనేక రెట్లు పెరిగాయి. ఎక్సైజు సుంకాలు, సెస్‌ల పేరుతో ప్రభుత్వం ఎడాపెడా పన్నులు విధించడంతో అవి చుక్కలనంటాయి. 2014లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు ఉన్నప్పుడు, రిటైల్‌గా పెట్రోల్ ధర లీటర్ రూ.71 ఉండేది. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 85 డాలర్లకు తగ్గినా, లీటర్ పెట్రోల్ రూ.111, డీజిల్ రూ.100 దాటింది. పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలో 66 శాతం చమురు మార్కెటింగ్ కంపెనీలకు, రిటైల్ ధరలో 34 శాతం డీలర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రూపంలో పొందేవి. 2014లో పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం ఆదాయం రాగా, ఇప్పుడు అది 32 శాతానికి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల వాటా 2014లో 17 శాతం ఉండగా, ఇప్పుడు అది 23 శాతానికి చేరుకుంది. డీలర్ల కమీషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు మొత్తం కలిపి 58 శాతానికి పెరిగాయి.
పెట్రోల్‌పై పనుుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014లో వలే పెట్రోల్, డీజిల్‌పై పన్ను విధించినట్లయితే, ప్రస్తుతం లీటర్ పెట్రోల్ కేవలం రూ.66 ఉంటుంది. 2014 తరువాత, గత ఏడేళ్ల (మోడీ సర్కార్ హయాం)లో డీజిల్‌పై పనుు ఆశ్చర్యకరంగా పెరిగింది. 2014లో డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం 8 శాతం ఉండగా, ఇప్పుడు అది 35శాతానికి పెరిగింది. 2014లో డీజిల్ నుంచి రాష్ట్ర పన్ను, వ్యాట్ రూపంలో 12 శాతం వసూలు చేయగా, ఇప్పుడు అది 15 శాతానికి చేరుకుంది. 2014 మాదిరిగానే డీజిల్‌పై పన్ను విధించినట్లయితే, ప్రస్తుతం ఒక లీటర్ డీజిల్‌ను రూ. 55కి పొందవచ్చు.
కేరళలో ఆరేేళ్లుగా పన్ను పెంచనేలేదు : ఆర్థిక మంత్రి బాలగోపాల్
కేరళలో గత ఆరేళ్లలో ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను పెంచలేదని, అందుకే పన్ను తగ్గించే యోచనేదీ చేయడం లేదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్ బాలగోపాల్ తెలిపారు. గతంలో ఉమెన్ చాందీ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం అయిదేళ్లలో 13 సార్లు పన్నులు పెంచిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేరళ ఇంధన పన్నును పెంచలేదని, ఎటువంటి సెస్ విధించలేదని మంత్రి బాలగోపాల్ తెలిపారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ''తాత్కాలికంగా పరువు నిలుపుకొనే చర్య''గా బాలగోపాల్ పేర్కొన్నారు.
మూడేళ్లలో 8 లక్షల కోట్లు వసూళ్లు :
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను చక్కటి ఆదాయ వనరుగా భావిస్తున్నది. గత మూడేళ్లలో మోడీ సర్కార్ కేవలం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల రూపంలో రూ.8.12 లక్షల కోట్లకుపైబడి రాబట్టుకుంది. ఎక్సైజ్ సుంకాల కింద 2014లో 75 వేల కోట్లు వసూలు చేసిన కేంద్రం, 2021లో దీనిని 3.60 లక్షల కోట్లకు పెంచేసింది.
సంవత్సరం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం
2013-14 రూ.53.09 వేల కోట్లు
2014-15 రూ.74.15 వేల కోట్లు
2015-16 రూ.1.55 లక్షల కోట్లు
2016-17 రూ.2.17 లక్షల కోట్లు
2017-18 రూ.2.04 లక్షల కోట్లు
2018-19 రూ.2.19 లక్షల కోట్లు
2019-20 రూ.2.22 లక్షల కోట్లు
2020-21 రూ. 3.71 లక్షల కోట్లు
సంవత్సరం లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం (రూ.)
2014 రూ.10
2015 రూ.18
2016 రూ.22
2017 రూ.20
2018 రూ.18
2019 రూ.20
2020 రూ.33
2021 రూ.33
సంవత్సరం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం(రూ.)
2014 రూ.5
2015 రూ.11
2016 రూ.18
2017 రూ.16
2018 రూ.14
2019 రూ.16
2020 రూ.32
2021 రూ.32
సంవత్సరం ముడి చమురు ధర బ్యారెల్ (డాలర్లు)
2014 109.54
2015 50.52
2016 39.46
2017 47.70
2018 63.55
2019 56.07
2020 22.59
2021 53.21
0 Comments