GET MORE DETAILS

ఒక రోజులో పగలు ,రాత్రి గంటలు సమముగా ఉండవు ఎందుకు ?

ఒక రోజులో పగలు ,రాత్రి గంటలు సమముగా ఉండవు  ఎందుకు ?




రోజుకు 24 గంటలు . రోజులో పగలు , రాత్రి ఉన్నా అవిరెండూ పన్నెండు గంటలుగా విభజించబడిఉండవు .ఋతువునుబట్టి పగటి పొద్దు లేదా రాత్రి పొద్దు అధికముగా ఉంటాయి.కాని సంవత్సరములో 2 రోజులు మాత్రమే పగలు రేయి సమానముగా ఉంటాయి. అది మార్చి 20/21 , సెప్టెంబర్ 22/23. ఆ రెండురోజుల్లో్ భూమద్యరేఖమీద లంబం గా సూర్యకిరణాలు పడతాయి. అందువల్ల ఆ రెండురోజులు పగలు రాత్రి సమము గా ఉంటాయి. ఆరోజులనే " విషువత్తులు(Equinoxes) " అంటారు .


సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజున(మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటుంది.

Post a Comment

0 Comments