GET MORE DETAILS

గీతాజయంతి _ మోక్షదా ఏకాదశి

గీతాజయంతి _ మోక్షదా ఏకాదశి.



మార్గశిర శుద్ధ ఏకాదశినే గీతాజయంతి ఆచరిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి ఇది గీతాజయంతిగా ప్రసిద్ధి చెందింది. ఈ గీతాజయంతి నాడు భగవద్గీతను పూజించి గీతాపారాయణము చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. 

మార్గశిర శుద్ధ ఏకాదశికే మోక్షదా ఏకాదశి అని పేరు. దీనినే సౌఖ్యదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణువును పూజించి, నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి. 

పూర్వం వైఖానసుడనే రాజు  ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన తండ్రికి నరక బాధల నుండి విముక్తిని కలిగించి, పుణ్యగతులను కలిగింపజేశాడని పురాణ కథనం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగి, మోక్షం లభిస్తుందని చెప్పబడింది. 

Post a Comment

0 Comments