GET MORE DETAILS

అప్రకటిత PRC పై అనేక సందేహాలు

అప్రకటిత PRC పై అనేక సందేహాలు

గత PRC లకు భిన్నంగా ప్రకటన ప్రక్రియ సాగుచున్నది.గతంలో కొన్ని సంఘాలు లేక జెఎసి లు సి.యం వద్ద బలమైన లాబీయింగ్ కలిగి ఉండేవారు.వారు ముందుగానే ప్రభుత్వ వర్గాలను సి.యం ను సానుకూలంగా స్పందించేటట్లు ఒప్పించేవారు.దానితో నాడు ఆర్థిక స్థితి ఏలా ఉన్నా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు కొంతవరకు నెరవేరేవి.నేడు సి.యం మరియు ప్రభుత్వ వర్గాలతో సంఘాలు,జెఎసిల పాత్ర నామమాత్రం.మనం వెళ్ళి వారు నోరు తెరవక ముందే ఏదో మాట్లాడి మెప్పుపొందడానికి ప్రయత్నాలు.కొత్తగా పుట్టుకొచ్చిన ఓ జెఏసి అయితే అబ్బే మాకేమి వద్దు అవనరమైతే మీ తరపున మేమే న్యాయస్తానాలకు వెళ్ళి సవాలు చేస్తాము అనే దుస్థితి.పరస్పరం ఆధిపత్యం కోసం పోరాడే సంఘాలు జెఏసి ఐక్యమైనా ఆ తాలూకా ఉద్యమ వేడి పుట్టించలేకపోవుట ఉద్యోగుల పోరాట తిరోగమనానికి నిదర్శనం.

ఫిట్ మెంట్ కొరకు భేరసారాలు అనాదిగా ఉంది.నాయకులకు,పాలకులకు ఉన్న సాన్నిధ్యం మరియు పలుకుబడే ఫిట్ మెంట్.నేటి సి.యం గారిది నయా స్టైల్.నేటికి అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఏనాడు జెఎసిలు లేక సంఘాలతో ముఖాముఖి చర్చలు లేవు.కనీసం ఇంటర్వూ ఇచ్చే సమయం కూడా లేదు.కీలక అంశాల మీద కూడా ప్రభుత్వ సలహాదారు దర్శనమే మహా సంబరం.ప్రభుత్వ పథకాలు ప్రకటించే ముందు చూపని ఆర్థిక గణాంకాలు వాటిని అమలు చేసే ఉద్యోగులకు ఏదైనా ఇచ్చే సమయంలో ప్రత్యక్షమవ్వడం విచారకరం.నిన్న సి.యస్ గారిచ్చిన గణాంకాలన్నీ ప్రజలలో ఉద్యోగవర్గాలపై వ్యతిరేకత సృష్టించడానికి ఉపయోగపడేవి.ప్రభుత్వం ప్రజలకు ఏమిచ్చినా ఉద్యోగులు స్వాగతించి చిత్తసుద్థితో అమలు చేయుటలో పాలకులకు అండగా ఉంటారు.ప్రజల నుండి ఉద్యోగులను విడదీయుటకు ప్రయత్నించుట విభజించు పాలించు సూత్రం.సంక్షేమం ద్వారా ప్రజలను ఆదుకున్నట్లే ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలు పరిష్కరించ వలసిన బాధ్యత ప్రభుత్షానిది కాదా...???

PRC అంటే కేవలం ఫిట్ మెంట్ మాత్రమే కాదు.దాని అమలు ఏలాగో 01-07-2018 కాని CASH ఎప్పటి నుండి అనేది కీలకం. ఇంటి అద్దె దానిపై సీలింగ్,AAS, గ్రాట్యుటి,కమ్యుటేషన్ ,వివిధ అలవెన్స్ లు వాటి అమలుపై స్పష్టత ఉండాలి.దీనిపై కనీసం సమయం కేటాయించి చర్చించే స్థితి ఉండాలి.అధికార గణం నుండి పాలకుల వరకు ఉద్యోగులకు ఊరకే ఇస్తున్నాం అనే ధోరణి నిన్న సి.యస్ గారు చూపిన గణాంకాలు బట్టి తేటతెల్లమైంది.సగటు ఉద్యోగికి ప్రస్తుత పిఆర్ సి చేదుగుళికే.కేవలం HRA వెసులుబాటు వలన పెరుగుదల మినహా మిగిలిన అంశాలలో పెరుగుదల శూన్యం.చాంతాడులా పేరుకుపోయాన బిల్లులు,పెండింగ్ డి.ఏలు,CPS రద్దు ఎండమావేనా?ఫిట్ మెంట్ ఎక్కడో ఓ చోట ఫిక్స్ అయినా ఇవి చేతికి రావడానికి ఎన్ని వాయిదాలో...???

Post a Comment

0 Comments