GET MORE DETAILS

విశ్వ సుందరిగా పంజాబ్‌ ముద్దుగుమ్మ _ హర్నాజ్‌ సంధుకి దక్కిన అందాల కిరీటం : 21 ఏళ్ల తర్వాత విశ్వవేదికపై మెరిసిన భారత్‌

 విశ్వ సుందరిగా పంజాబ్‌ ముద్దుగుమ్మ _ హర్నాజ్‌ సంధుకి దక్కిన అందాల కిరీటం : 21 ఏళ్ల తర్వాత విశ్వవేదికపై మెరిసిన భారత్‌



అందాల విశ్వంపై భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడిండి. పంజాబ్‌ ముద్దుగుమ్మ హర్నాజ్‌ సంధు(21) విశ్వసుందరి-2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత మళ్లీ మన దేశానికి దక్కింది. ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌ నగరం వేదికగా జరిగిన 70వ విశ్వసుందరి పోటీల్లో 79 దేశాల నుంచి అందగత్తెలు పోటీపడ్డారు. సోమవారం జరిగిన తుది రౌండ్‌లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు అద్భుతమైన రీతిలో సమాధానం చెప్పి హర్నాజ్‌ తొలి స్థానంలో నిలిచారు. పరాగ్వే సుందరి నదియా ఫెరారియా(22) ద్వితీయ స్థానం, దక్షిణాఫ్రికా అందగత్తె లలేలా మ్స్వానే (24) మూడో స్థానం దక్కించుకున్నారు. విశ్వసుందరిగా ఆవిర్భవించిన హర్నాజ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments