GET MORE DETAILS

ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకే 36% వ్యయం

ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకే 36% 



రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసమే 36 శాతం వెచ్చిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని పీఆర్‌సీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111 శాతం మేర ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసమే ఖర్చవుతోందని వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం 2018-19లో రూ.52,513 కోట్లు వ్యయం కాగా... 2020-21 నాటికి ఆ మొత్తం రూ.67,340 కోట్లకు చేరిందని వివరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపించిందని వెల్లడించింది.

Post a Comment

0 Comments