బ్యాంకు ఖాతాలు తెరవకపోతే చర్యలు: సమగ్రశిక్ష అభియాన్
పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మండల విద్యాధికారులు, క్లస్టర్ రిసోర్సు కేంద్రాలు యూనియన్ బ్యాంకులో ఖాతాలు తెరవాలని సమగ్రశిక్ష అభియాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి ఆదేశాలు జారీ చేసినా కొంతమంది ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు తెరవలేదని, వెంటనే ఖాతాలు తీయాలని పేర్కొంది. ప్రజా ఆర్థిక పర్యవేక్షణ వ్యవస్థ (పీఎఫ్‌ఎంఎస్) అమలుకు వీటిని తెరవాలని, ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
0 Comments