GET MORE DETAILS

21న ఏపీ స్టడీ సర్కిల్ ప్రారంభం

 21న ఏపీ స్టడీ సర్కిల్ ప్రారంభం



డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏపీ స్టడీ సర్కిల్ సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి అందు బాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1.83 ఎకరాల్లో రూ.4.5 కోట్లతో ఏపీ స్టడీ సర్కిలు రుషికొండ వద్ద నిర్మిం చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం స్టడీ సర్కిల్ సేవలు నిలిచిపోయాయి. విజయవాడ, తిరుపతిలో ప్రాంతీయ శాఖ భవనాలు ఉన్నప్పటికీ విధానపరమైన నిర్ణ యాల అమలుకు గత కొన్నేళ్లుగా ప్రధాన కార్యాలయం అం దుబాటులో లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ కేంద్రంగా ఏపీ స్టడీ సర్కిల్ నిర్మించారు. స్టడీ సర్కిల్ చైర్మన్ ఇక్కడి నుంచే సేవలు అందించను న్నారు. తొలి బ్యాచ్లో వంద మంది విద్యార్థులు సివిల్స్ శిక్షణ అందిస్తారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహ న్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్టడీ సర్కిల్ను ప్రారం భించనున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వ రూప్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Post a Comment

0 Comments