GET MORE DETAILS

ఆ నివేదిక రహస్యం _ ఏయూలో టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణకు కమిటీ. దాని నివేదిక ఆధారంగా ప్రక్రియ రద్దు. రిపోర్టును బయట పెట్టని పాలకులు : మూడున్నరేళ్లుగా ఓ వ్యక్తి పోరాటం

 ఆ నివేదిక రహస్యం _ ఏయూలో టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణకు కమిటీ. దాని నివేదిక ఆధారంగా ప్రక్రియ రద్దు. రిపోర్టును బయట పెట్టని పాలకులు : మూడున్నరేళ్లుగా ఓ వ్యక్తి పోరాటం



ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివాదాస్పదమై, రద్దయిన టీచింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై వివాదం ఇంకా కొనసాగుతోంది. సదరు ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై ఓ కమిటీ విచారణ జరిపింది. ఆ విచారణ నివేదికను బయటపెట్టాలంటూ గత మూడున్నరేళ్లుగా ఓ వ్యక్తి చేస్తున్న పోరాటం రాష్ట్రాన్ని దాటి కేంద్ర స్థాయికి చేరింది. 

వివరాలు ఇవీ...

విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా... వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టులకు 2018లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే, ఈ భర్తీ వ్యవహారంపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏయూ ఉన్నతాధికారులు విచారణ కమిటీని నియమించారు. దానికి ఏయూ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రాధాకృష్ణ నేతృత్వం వహించారు. కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి యూనివర్సిటీకి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూనివర్సిటీ పాలకులు ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో నిర్ణయించారు. 

ఎవరి ఆదేశాలనూ పాటించం :

సదరు కమిటీ ఏమి నివేదిక ఇచ్చిందో తెలపాలని ఎ.జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి గత మూడున్నరేళ్లుగా యత్నిస్తున్నా ఏయూ ఉన్నతాధికారులు నుంచి ఏమా త్రం స్పందన లేదు. కమిటీ నివేదికను ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పందించలేదు. దీంతో ఆయన 2019లో ఉన్నత విద్యా శాఖలోని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారికి, అసిస్టెంట్‌ సెక్రటరీకి, రాజ్‌భవన్‌లోని పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారికి, రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయా అధికారులు సదరు దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వాలంటూ ఏయూని ఆదేశించారు. ఆ ఆదేశాలనూ ఏయూ ఉన్నతాధికారులు పాటించలేదు.

కేంద్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు : 

ఏయూ అధికారులు తాను అడుగుతున్న సమాచారాన్ని ఇవ్వడం లేదంటూ జగన్మోహన్‌రెడ్డి తాజాగా కేంద్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘‘టీచింగ్‌ పోస్టుల భర్తీ పేరుతో యూనివర్సిటీ అధికారులు అప్పట్లో రూ. 31,48,229 వెచ్చించారు. ఇప్పుడు... ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నామంటే దానికి బాధ్యులు ఎవరు? విచారణ కమి టీ తన నివేదికలో ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తూ... నోటిఫికేషన్‌ రద్దుకు సిఫారసు చేసింది? ఆ విషయాలను బయటపెట్టాలి’’ అని జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0 Comments