GET MORE DETAILS

ప్రైవేటు కాలేజీల భవిష్యత్తు అగమ్యగోచరం : అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి రమణాజీ ఆందోళన

 ప్రైవేటు కాలేజీల భవిష్యత్తు అగమ్యగోచరం : అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి రమణాజీ ఆందోళన


 రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల భవిష్యత్తు అగమ్యగోచరంగా వుందని అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల రమణాజీ అన్నారు. అమరావతిలో 19న జరిగిన ఎన్నికల్లో సంఘం నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన బుధవారం చోడవరంలో విలేకరులతో మాట్లాడారు. పది యూనివర్సిటీల పరిధిలో 1,204 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి డిగ్రీ కళాశాలలకు రూ.289 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన కింద మరో రూ.150 కోట్లు కలిపి మొత్తం రూ.439 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా దీవెన పథకం కింద ఇస్తున్న డబ్బులను వారు కళాశాలలకు చెల్లించడం లేదని, దీనివల్ల కళాశాల మనుగడ కష్టంగా మారిందని తెలిపారు. ఇదే సమయంలో డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనేజ్‌మెంట్‌ కోటా వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై త్వరలోనే అమరావతిలో సమావేశం నిర్వహిస్తామని వివరించారు.

Post a Comment

0 Comments