GET MORE DETAILS

జాతీయ రైతు దినోత్సవం 23 డిసెంబర్

జాతీయ రైతు దినోత్సవం 23 డిసెంబర్



డిసెంబర్‌ 23 న - జాతీయ రైతు దినోత్సవం (ఫార్మర్స్‌ డే). మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌ జన్మదినం అయిన ఈ రోజును భారత్‌లో "రైతుదినోత్సవం"  (కిసాన్‌ దివస్‌) గా జరుపుకుంటారు.

జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.

ప్రారంభం :

చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.

కార్యక్రమాలు :

రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

గుర్తింపు : 

చరణ్ సింగ్ మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత  చరణ్ సింగ్ చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.

ఈ లోకములోని ప్రజలందరి ఆకలి బాధను తొలగించె పరోక్ష దైవాలు రైతులు. నేలతల్లిని నమ్ముకొని , పలురకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించి దేశ ఆర్ధికవ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తారు వ్యవసాయధారులు.

దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న ల పరిస్థితి అతివృష్టి, అనావృష్టిల ధాటికి నేడు అతలాకుతలం అవుతోంది.. దేశానికి రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్య త ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్‌... జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారతవనిలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు. భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన రోజు డిసెంబర్‌ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు.

ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జన) విజ్ఞాన వేదిక ద్వారా సమాచారం...

బలవన్మరణాలకు కారణాలు...

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదం గా మారింది. ఒక రోజు వర్షాల కోసం.., ఇంకోరో జు విత్తనాల కోసం.. మరో రోజు ఎరువుల కోసం.., బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఒత్తిళ్లు, నష్టాలు, వ్యవసాయ పనుల చాకిరీ భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసా యం మానేస్తున్నారు. కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు. ఎన్నికల్లో పార్టీలు రైతు లకు ఎన్ని హా మీలిచ్చినా రైతుల పరిస్థితి మాత్రం మారడం లే దు. పంటలు సాగు చేసి దిగుబడి రాక అప్పుల బా ధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక, దిక్కుతోచని స్థితిలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

దేశానికి రైతే వెన్నెముక అని గొప్పగా చెప్పడం తప్ప రైతుకష్టానికి వెల కట్టేటోడు లేడు. మన రాయలసీమ లో అసలే కరువు, వున్న బోరుబావులు అడుగంటాయి. ఈ కరువులో కూడా నానా అవస్థలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఉసూరు మంటున్నారు. పొలంలో దుక్కి దున్నడానికి మెదలు పంట అమ్మకం దాకా "ముందు ధగా, వెనుక ధగా, కుడిఎడమల ధగా ధగా" అన్న రీతిగా మారింది.  కనికరించాల్సిన పాలకులు ప్రచారార్బాటం తప్ప రైతుల కోసం చేసింది శూన్యం. ఏటా వందలాది మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక తనువు చాలిస్తున్నారంటే దానికి కారణం ఎవరు?

రాయలసీమ కరువుకు, రైతుబలవన్మరణాలకు కారకులెవరో గుర్తించాలని సమయం ఆసన్నమైనది.

రైతు దినోత్సవం రోజు రైతురక్షణ కోసం దీక్ష బూనుదాం.

కౌలు రైతుల పరిస్థితి...

కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూ మివారిది కాదు.. పంట పండితే పూర్తి పంట చేతికి రాదు.. వీరికి వ్యవసాయ రుణాలు కూడా రావు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న వీరి విషయంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సొంత భూమి లేకపోవడం, భూమి కౌలుకు తీసుకుంటే ఎక్కువరేట్లు చెల్లించడం, భూమి యాజమాని కాకపోవడం వల్ల పంటరుణాని కి ఎవరూ నమ్మడం లేదు. దీంతో రూ.5, 10ల ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడి వీరు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన రుణఅర్హత పత్రాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవే టు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి అప్పుల పాలవుతున్నారు.

దళారుల చేతిలో...

కష్టపడి కాలానికి ఎదురీది పంటలు పండిస్తే దళారులు రైతుల మీద పడి దోచుకుంటున్నారు. మార్కెట్లో తిష్టవేసిన దళారులు రైతుల శ్రమను చౌకగా కొని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతు న్నారు. ఈ దళారుల వ్యవస్థను అరికట్టే విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకొని రైతును రాజుగా చే యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పం టల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత రైతులను నష్టాలకు గురిచేస్తోంది.

ప్రజలంతా  అండగా నిలవాలి...

పంటలు పండక.. పండిన పంటలకు గిట్టుబాటు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆపన్నహస్తం కోసం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధిని ఏర్పా టు చేసి ఆదుకుంది.. పెద్ద దిక్కు కోల్పోయి అల్లాడుతున్న అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచి జిల్లాలో 5 కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాలు కూడా అన్నదాతలను ఆదుకుంటే అసలు ఆత్మహత్యలే జరగవు.

రైతన్న ఒక్క క్షణం ఆలోచించు :

కష్టాలసాగు కడగండ్లు మిగిల్చినా రైతులు గుండెనిబ్బరం చేసుకోవాలి.. ఒక్కసారి కు టుంబం గురించి ఆలోచించుకోవాలి. భార్య, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలి. కష్టాలు ఈ రోజు ఉండచ్చు... రేపు పోవచ్చు..దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు. జిల్లాలో ఈ సంవత్సరం 99 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడడం ప్రతి ఒక్కర్ని ఆందోళన కు గురిచేస్తోంది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే రైతన్నలు బతికి సాధించా లని మేధావులు, స్వచ్ఛంద సంఘాలు కోరుతున్నాయి.

Post a Comment

0 Comments