GET MORE DETAILS

దైవం అంతటా ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు ? ఆలయాలు ఎందుకు ?

 దైవం అంతటా ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు ? ఆలయాలు ఎందుకు ?




దైవం అంతటా ఉంటాడు. అయినా, నీకు దానిని అధికంగా భావించాలి, చూడాలి, చేయాలి అని అనిపించినప్పుడు, నీ కోసం ప్రత్యేకమైన ఒక వ్యవస్థ కావాలి. గాలి అంతటా ఉండేదే. కానీ నీకు అది చాలటం లేదు.  నీకు గాలి కొంచెం ఎక్కువ కావాలి కనుక, చేత్తోనైనా   విసురుకుంటావు, విసనకర్రతోనైనా విసురుకుంటావు, లేదా ఫ్యాన్ ఐనా ఉపయోగించుకుంటావు. 

అంతటా ఉండే దేవుడు - అంతటా ఉండే దైవాన్ని నీ కళ్ళతో చూడాలి అని కానీ, చేతులతో మ్రొక్కాలి అని కానీ, నోరారా పాడాలి అని కానీ అనిపించినప్పుడు, నీ కోసం ఆ దేవుడు ఆంగీకరించిన రూపమే విగ్రహము. 

అయితే నీకు ఫ్యాన్ లో  నుంచి గాలి కావాలి అంటే ఊరికే రాదు. దానికి ఒక వ్యవస్థ కావాలి. ఒక ఫ్రేమ్ కావాలి, లోపల కొన్ని రేకు ముక్కలు పెట్టాలి. మధ్యలో ఒక హబ్ తయారు చేయాలి. మధ్యలో మెషిన్ పెట్టాలి. దానికి కొన్ని బటన్స్ పెట్టాలి. వైర్ తగిలించాలి. ఎక్కడో స్విచ్ పెట్టాలి. ఇన్ని పెట్టినా కరెంటు ఉండాలి. ఇన్ని పెడితేనే నీవు కోరుకున్న రీతిలో గాలి నీకు వస్తుంది. 

ఇదే క్రమంలో మనం కోరుకున్నప్పుడు మన కోసమని ఒక రాతి తోనో, లోహం తోటో, చెక్క  తోటో, వస్త్రం మీదో ఒక రూపాన్ని మనం తయారు చేస్తే దానికి ఒక ఫ్రేమ్ లాగ ఒక ఆలయాన్ని నిర్మాణం చేస్తే దానికి ఒక మంత్రం అనే కనెక్షన్ ఇస్తే, అక్కడ దేవుడు నీ కోసం తన యొక్క అనుగ్రహాన్ని గాలి ఇచ్చినట్లుగా ప్రసరింపచేస్తాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. 

మనకి ఆలయం మన రక్షణ కోసం. సమాజ రక్షణ కోసం. వేడి తాపం పెరిగితే, మనకు గాలి ఎట్లా అవసరమో, సమాజంలో కూడా క్లేశాలు పెరిగితే, కష్టాలు పెరిగితే, దుఃఖాలు కలిగితే, నష్టాలు కలిగితే, వీటిని తగ్గించి, మనకు సుఖాన్ని ఇవ్వడం అనేది, విగ్రహం యొక్క లక్ష్యం, ఆలయం యొక్క లక్ష్యం. దాన్ని మనం రక్షించుకుంటే అది మనకు లాభం. దాన్ని భక్షిస్తే మనకే నష్టం. అందుచేత మనం దాన్ని కాపాడాలి.

ఆలయాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత.

Post a Comment

0 Comments