GET MORE DETAILS

సముద్రపు గాలి మన శరీరానికి మంచిదేనా ?

సముద్రపు గాలి మన శరీరానికి మంచిదేనా ?సముద్రపు గాలి మన శరీరానికి మంచిదే. సముద్ర తీరపు వాతావరణం మన శరీరంలోని శ్వాసావయవాలకు, చర్మానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా, దేహానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆస్తమా, చర్మ సంబంధిత అలర్జీలు, సమస్యలు ఉన్న వారికి సముద్రపుగాలి సోకాలని వైద్యులు సలహా ఇస్తారు. వేసవిలో వీచే సముద్రపు గాలిలో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండడంతో శరీరంపై చెమట పోసి అసౌకర్యానికి గురి చేసినా, ఆ గాలుల్లో కాలుష్యం లేనందున మిగతా కాలాల్లో శ్వాసకోశ వ్యాధులున్న వారికి అనుకూలంగా ఉంటాయి. ఆ గాలుల్లో ఉప్పుతో కూడిన అతి చిన్న సముద్రపు నీటి కణాలు, అయోడిన్‌, మెగ్నీషియంలాంటి మూలకాలు ఉండడం వల్ల ఇవి మన శ్వాస సంబంధిత మార్గాల్లో శ్లేష్మం చేరకుండా ఉంచుతుంది. జనావాసాలకు దూరంగా ఉండే సముద్రపు గాలుల్లో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కూడా కలవకపోవడంతో అది మరింత ఆరోగ్యకరం.

Post a Comment

0 Comments