GET MORE DETAILS

ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది - రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వ్యాఖ్యలు

 ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది - రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వ్యాఖ్యలు



ఆదాయ వాస్తవిక అంచనాలో విఫలం

అంచనాలకు మించిన రెవెన్యూ లోటు

రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల 

ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది

రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వ్యాఖ్యలు


ఏపీలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. 2019-20లో రెవెన్యూ లోటు బడ్జెట్‌ అంచనాలకంటే పెరిగిందన్నారు. అమ్మఒడి, ఉచిత విద్యుత్‌ సరఫరా తదితర అనేక పథకాల వల్ల రెవెన్యూ లోటు అనూహ్యంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేవారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాలను వాస్తవికంగా అంచనా వేయడంలో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంటుగా అందినప్పటికీ, రాష్ట్ర రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగుతోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధుల పంపిణీ తర్వాత 2020-21లో  రెవెన్యూ లోటు అంచనా 5,897కోట్లు ఉండగా, వాస్తవిక రెవెన్యూ లోటు 34,926.80కోట్లకు పెరిగిందని చెప్పారు. కాగ్‌ నివేదిక ఆధారంగా పన్నుల రూపంలో రాష్ర్టానికి 29,935.32కోట్లు, గ్రాంట్‌గా 57,930.62కోట్లు, రుణాల కింద 2వేల కోట్లు విడుదల చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పన్నుల రూపంలో 77,398కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా, 57,377.97కోట్లు మాత్రమే సమకూరిందని తెలిపారు. పన్నులేతర రెవెన్యూ 5,267కోట్లు వస్తుందని అంచనా వేయగా 3,309.61కోట్లే వచ్చిందన్నారు.

Post a Comment

0 Comments