GET MORE DETAILS

కెజిబివిలో భర్తీకి ముందే బదిలీలు - విద్యా శాఖ మంత్రికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి

కెజిబివిలో భర్తీకి ముందే బదిలీలు  - విద్యా శాఖ మంత్రికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి



కెజిబివి పాఠశాలల్లో ఉపాధ్యాయ, అధ్యాపకుల, ఎస్ఓ ఖాళీల భర్తీకి ముందే బదిలీలు చేపట్టాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, షేక్ సాన్జీ శు క్రవారం లేఖ రాశారు. బదిలీలు చేపట్టాలని పిడిఎఫ్, ఉద్యోగ సంఘాల తరపున అనేక విజ్ఞప్తులు చేశామని తెలిపారు. 

సుదీర్ఘకాలంగా మారుమూలన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు బదిలీల కొరకు ఎదురు చూస్తున్నారని వివరించారు. క్లియర్ వేకెన్సీలకు, మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించినట్లయితే స్పౌజ్లు, ఇతర ఇబ్బందులు ఉన్న వారికి ఉపయోగం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ముందుగా క్లియర్ వేకెన్సీలు, మ్యూచువల్ బదిలీలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments