GET MORE DETAILS

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి - ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి - ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి



విద్యార్థులు ప్రకృతి విపత్తులకు గురికాకుండా రక్షించుకోవాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రులతో పాటు పాఠశాలల టీచర్లపైనా ఉందని, ఆ దిశగా ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు.'విద్యార్థి కేంద్రీకృత విపత్తు ప్రమాద తగ్గింపు' అంశంపై గుంటూరు జిల్లా బాపట్లలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ కేంద్రంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు సమా వేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో మానసిక ఔన్నత్యాన్ని, స్థిరత్వాన్ని పెంపొందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు.ఈ శిక్షణలో భాగంగా విపత్తు నిర్వహణ, విద్యా కేంద్రీకృత విపత్తు తగ్గింపు, బాలల హక్కులు, విపత్తుల సమయంలో బాలల హక్కుల రక్షణ, వాతావరణ మార్పుల్లో పిల్లల సంర క్షణ, పాఠశాల భద్రత, బాలల మానసిక ఆరోగ్యంపై విపత్తుల ప్రభావం, పిల్లల్లో సామర్ధ్యాభివృద్ధి, విద్యార్ధి కేంద్రీకృత విపత్తు నిర్వహ ణను ప్రధాన స్రవంతిలో కలపడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులను బాపట్ల సమీపాన కొండబొట్లవారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి వారు నేర్చుకున్న విషయాలను ఆ పాఠశాలలో పరిశీలింప జేసి వాటి మీద చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Post a Comment

0 Comments