GET MORE DETAILS

ఉద్యోగాలు కల్పించేందుకు మన్‌స్టార్‌ డాట్‌ కామ్‌తో ఒప్పందం

 ఉద్యోగాలు కల్పించేందుకు మన్‌స్టార్‌ డాట్‌ కామ్‌తో ఒప్పందంయువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మన్‌స్టార్‌ డాట్‌ కామ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీ బంగార్రాజు తెలిపారు. ఈ సంస్థ నిర్వహించే ఉద్యోగ మేళాలకు నిరుద్యోగ యువతను ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా వర్చువల్‌ విధానంలో అనుసంధానిస్తామని, జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న సుమారు 6 లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా మన్‌స్టార్‌ డాట్‌ కామ్‌లో నమోదు చేసుకున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన అభ్యర్థులకు వర్చువల్‌లో కెరీర్‌ ఫెయిర్లు, వెబినార్లు నిర్వహిస్తారు. పోర్టల్‌లోని మెటీరియల్‌, బ్లాగులు, నిపుణుల సలహాలు-సూచనలను ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు అందిస్తారు.

Post a Comment

0 Comments