నోబెల్ వరల్డ్ రికార్డులో చిన్నారికి చోటు
బుడి బుడి అడుగులు వేస్తున్న రెండేళ్ల 10 నెలల చిన్నారి వినిశకు నోబెల్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శాస్త్రి నగర్‌కు చెందిన విశ్వనాథుల సౌమ్యప్రియ, పవన్‌కుమార్ కుమార్తె వినిశ ప్రతిభ చూపినందుకు నోబెల్ వరల్డ్ వారు ‘వరల్డ్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ కిడ్’ ప్రశంసా పత్రం, మెడల్, రూ.2వేలు అందించారు.
ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలో ఈ చిన్నారి 30 పద్యాలు, సోలార్ సిస్టం, వారాలు, నెలల పేర్లు, చెస్ పెట్టడంలో, 50 జీకే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఈ అవార్డు బహూకరించారు. ఈ చిన్నారి గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది.
0 Comments