ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో అవకాశాలు బోలెడు
వెబ్‌సైట్‌లలో యూజర్ ఇంటరాక్టివిటీకి ప్రాధాన్యం పెరుగుతోంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లకు జావాస్క్రిప్ట్‌ను జోడించి గ్రాఫిక్స్, ఇంటరాక్టివిటీతో కూడిన డైనమిక్ వెబ్‌సైట్లకు ఆదరణ ఎక్కువ. దాంతో ఐటీ రంగంలో.. ముఖ్యంగా వెబ్ డెవలప్‌మెంట్‌లో జావాస్క్రిప్ట్ కీలక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మారుతోంది. చిన్నచిన్న కంపెనీల నుంచి పెద్ద సంస్థల వరకూ.. జావాస్క్రిప్ట్‌ను వినియోగిస్తున్నాయి. దాంతో ఈ టెక్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో.. జావాస్క్రిప్ట్‌తో ప్రయోజనాలు.. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ తీరుతెన్నులు.. నేర్చుకునేందుకు అర్హతలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
జావాస్క్రిప్ట్ అనేది వెబ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తోపాటు ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పటికప్పుడు మారుతూ డైనమిక్‌గా ఉండే వెబ్ పేజీలు, యూజర్స్‌తో ఇంటరాక్టివ్‌గా ఉండే వెబ్‌సైట్‌లు రూపొందించేందుకు జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు. ఇది వెబ్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లలో ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్‌సేవల్లోనూ జావాస్క్రిప్ట్ డెవలపర్‌ది ప్రధాన పాత్ర. డెవలపర్ ఉద్యోగాల్లో మూడో వంతు ఉద్యోగాలు వీరికి సంబంధించినవే ఉంటున్నాయి. కాబట్టి జావాస్క్రిప్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు.
0 Comments