Ads Area

326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 4 వేల దరఖాస్తులు.

0

326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 4 వేల దరఖాస్తులు.



వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని బోధన కళాశాలలు, ఆసుపత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల భర్తీకి గత నెల 22న నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

326 పోస్టుల్లో 188 పోస్టుల్లో కొత్త వారిని, మిగిలిన 138 పోస్టుల్లో ఏపీవీవీపీ, ప్రజారోగ్య విభాగం పరిధిలో పనిచేస్తోన్న వైద్యులకు బోధన కళాశాలల్లో అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.

ఈ నెల 30 న ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 8 వరకూ అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9న తుది మెరిట్ జాబితా ప్రకటిస్తారు. జనవరి 15లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని డీఎం డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు 'సాక్షి'కి తెలిపారు.

జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)ల ద్వారా స్టాఫ్ నర్సు, పారా మెడికల్ పోస్టుల భర్తీ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area