GET MORE DETAILS

Warangal NIT : వెయ్యి పరిశోధనలతో నిట్‌ రికార్డు బ్రేక్‌

Warangal NIT : వెయ్యి పరిశోధనలతో నిట్‌ రికార్డు బ్రేక్‌



వరంగల్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) 2021 విద్యా సంవత్సరంలో 1,000 పరిశోధన పత్రాలతో తన రికార్డు తానే బ్రేక్‌ చేసింది. రికార్డుస్థాయిలో పరిశోధనలు చేపట్టి పరిశోధన పత్రాల ప్రచురణ రికార్డు బ్రేక్‌ చేసినట్లు స్పోపస్‌ డేటాబేస్‌ సంస్థ వెల్లడించడం అభినందనీయమని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్‌ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులను ఆయన అభినందించారు.

నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో ప్రత్యేకత చాటుకుంటున్న నిట్‌ వరంగల్‌ 2017 విద్యా సంవత్సరంలో 540 పరిశోధన పత్రాలను ప్రచురణకు ఇవ్వగా.. 2021లో రికార్డుస్థాయిలో వెయ్యి పరిశోధన పత్రాలను సమర్పించడం విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. ఇది నిట్‌ మెరుగైన ర్యాంకింగ్‌ సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments