GET MORE DETAILS

మహమ్మారి విజృంభణ _ 27 వేలు దాటిన కేసులు

 మహమ్మారి విజృంభణ _ 27 వేలు దాటిన కేసులు

 

పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థల మూత

 సుప్రీంలో వర్చువల్‌ విచారణ

దేశంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కేవలం 6 రోజుల్లోనే కొత్త కేసుల సంఖ్య 4.33 రెట్లు పెరిగింది. డిసెంబరు 28న 6,358 రోజువారీ కేసులు నమోదు కాగా ఆదివారానికి వాటి సంఖ్య 27,553కి చేరింది. పాజిటివిటీ రేటు 0.61% నుంచి ఏకంగా 2.55%కి చేరడం వైరస్‌ వ్యాప్తి తీవ్రతను చెబుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే ఆదివారం 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. కొవిడ్‌ ఉద్ధృతి మొదలవడంతో వివిధ రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు కూడా రెండు వారాల పాటు విచారణలను వర్చువల్‌గా చేపట్టేందుకు నిర్ణయించింది.*

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వం కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమైంది. ఈమేరకు రాష్ట్రంలో సోమవారం నుంచి అన్ని విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు), పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50% సిబ్బందితోనే పనిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేదీ ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 15 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ కేవలం అత్యవసర సర్వీసులనే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ముంబయి, దిల్లీల నుంచి వారానికి రెండు రోజులే (సోమ, శుక్రవారాల్లో) విమానాలు నడుస్తాయని, బ్రిటన్‌ నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. ముప్పు లేని దేశాల నుంచి వచ్చే వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను తప్పనిసరి చేశారు. బ్రిటన్‌ నుంచి రావాలనుకున్న వారు వేరే నగరంలో దిగి.. దేశీయ విమానాలు లేదా రైళ్లలో పశ్చిమబెంగాల్‌కు రావచ్చని ద్వివేదీ తెలిపారు. ఈనెల 22న 4 నగరాల్లో నిర్వహించాల్సిన స్థానికసంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొవిడ్‌ ఆంక్షల్లో భాగంగా.. లోకల్‌ రైళ్లను (రాత్రి 7 వరకు), కోల్‌కతా మెట్రో సర్వీసులను 50% శాతం ప్రయాణికులతో అనుమతిస్తారు. షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు రాత్రి 10 వరకే సగం సామర్థ్యంతో నిర్వహించాల్సి ఉంటుంది. జూలతో పాటు ఈత కొలనులు, పార్లర్లు, స్పాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, జిమ్‌లు వంటివి కూడా మూసివేస్తారు. 50% సామర్థ్యంతో సినిమా హాళ్లకు అనుమతించారు. సమావేశాలు, సదస్సులకు గరిష్ఠంగా 200 మందిని.. లేదా ఆయా ప్రాంగణాల సామర్థ్యంలో సగం మందిని అనుమతిస్తారు. బార్లు, రెస్టారెంట్లను 50% సామర్థ్యంతో రాత్రి 10 వరకే నడపాల్సి ఉంటుంది.  ":

 దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి అమాంతం పెరుగుతోంది. రోజువారీ కేసులతో పాటు పాజిటివిటీ రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఆరో రోజు కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 27,553 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 284 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 4,778 కేసులు పెరగ్గా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05% నుంచి 2.55%కి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో ఒక్కరోజులో 29% కొవిడ్‌ కేసులు పెరిగాయి. ఈమేరకు ఆదివారం 11,877 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆదివారం 1,525కి పెరిగింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి."

Post a Comment

0 Comments