GET MORE DETAILS

రాజా శ్రీ రావు శ్వేతాచలపతి సర్ రామకృష్ణ రంగారావు (20 ఫిబ్రవరి 1901 - 10 మార్చి 1978 ) - ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 6,7,9 వ ముఖ్యమంత్రి

రాజా శ్రీ రావు శ్వేతాచలపతి సర్ రామకృష్ణ రంగారావు (20 ఫిబ్రవరి 1901 - 10 మార్చి 1978 ) - ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 6,7,9 వ ముఖ్యమంత్రిభారత రాజకీయ నాయకులు మరియు జమీందార్. వీరు 5 నవంబర్ 1932 నుండి 4 ఏప్రిల్ 1936 వరకు మరియు 24 ఆగష్టు 1936 నుండి 1 ఏప్రిల్ 1937 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు.

రామకృష్ణ రంగారావు గారు 1901లో బొబ్బిలి జమీందారీ రాజకుటుంబంలో జన్మించారు. తండ్రి రాజా వెంకట కుమార్ కృష్ణ రంగారావు గారి తరువాత అతని వారసుడిగా బొబ్బిలి సింహాసనాన్ని
అధిష్టించి 1921 నుండి 1948 వరకు పరిపాలన చేస్తూ 1948 నుండి 1978 వరకు టైటులర్ 'రాజా ఆఫ్ బొబ్బిలి' గా కొనసాగారు. అనేక సేవాసంస్థలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు మరియు
క్రీడలను ప్రోత్సహించారు.

రామకృష్ణ రంగారావు గారు 1930 లో జస్టిస్ పార్టీలో చేరి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. వీరు 1932 నుండి 1936 వరకు మరియు 1936 నుండి 1937 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేదా ప్రీమియర్‌గా సేవలందించారు. 1937 లో జస్టిస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన 1946 నుండి 1951 వరకు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ సభ సభ్యునిగా సేవలందించారు.

తరువాతి కాలంలో ఒక పర్యాయం బొబ్బిలి నియోజక వర్గానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా కూడా సేవలందించారు.
రామకృష్ణ రంగారావు గారు 1921లో లక్ష్మీసుభద్రయమ్మ గారిని వివాహమాడారు. 1978 నుండి వారి కుమారుడైన వెంకట గోపాలకృష్ణ రంగారావు గారు వారి తరువాత బొబ్బిలి రాజుగా కొనసాగారు.

ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు కళాశాలల స్థాపన ద్వారా సమాజానికి వారు అందించిన ఎనలేని సేవలకు గాను రామకృష్ణ రంగారావు గారు చిరస్మరణీయులు.

Post a Comment

0 Comments