బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్ల భర్తీ
పుణె ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జనరలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
జనరలిస్ట్ ఆఫీసర్లు స్కేల్-2: 400
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల అనుభవం ఉండాలి.
జనరలిస్ట్ ఆఫీసర్లు స్కేల్-3: 100
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్-20 ప్రశ్నలు- 15 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు- 15 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ - 20 ప్రశ్నలు- 15 నిమిషాలు
ప్రొఫెషనల్ నాలెడ్జ్- 90 ప్రశ్నలు- 75 నిమిషాలు
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1180, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి.పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22.
పరీక్ష తేదీ: మార్చి 12
వెబ్‌సైట్: https://www.bankofmaha-rashtra.in/
0 Comments