GET MORE DETAILS

పీఎస్‌ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం - ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి

పీఎస్‌ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం - ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి

ఉదయం  5.59 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-52



షార్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్ణిత సమయంలో కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు.  25.30 గంటలు కొనసాగిన కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం సోమవారం తెల్లవారుజామున 5.59 గంటలకు రాకెట్‌ నింగిలోకి విజయవంతం గా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథన్‌ షార్‌కు విచ్చేసి పర్యవేక్షణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఎస్‌ఎల్‌విసి – 52 ప్రయోగం అత్యంత కీలక ప్రయోగమని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగ పనులుసాఫీగాసాగుతున్నాయని , త్వరలోనే ప్రయోగిస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో పిఎస్‌ఎల్‌విసి-53 రాకెట్‌ ప్రయోగం కూడా ఉంటుందని చెప్పారు. కరోనా సమయంలో కష్టపడి పని చేసిన శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం చేశారు అని ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments