GET MORE DETAILS

మాజీ కేంద్రమంత్రి ఎర్రన్న 65వ జయంతి నివాళులు (జననం:23-02-1957 - మరణం:02-09-2012)

మాజీ కేంద్రమంత్రి ఎర్రన్న 65వ జయంతి నివాళులు

(జననం:23-02-1957--మరణం:02-09-2012)




సిక్కోలు సింహం, ఉత్తరాంథ్ర ముద్దు బిడ్డ దివంగత కింజారపు ఎర్రంన్నాయుడి 65 వ జయంతి సందర్భంగా ఘననివాళులు.నాయకత్వం యెడల అచెంచల విశ్వాసం,ప్రజలలో మమేకమై జననీరాజనాలు అందుకొన్న పీపుల్స్ మాస్ లీడర్ ఎర్రన్న .11,12,13మరియు14వ లోకసభకు వరుసగా నాలుగు సార్లు ఏన్నికై రాజకీయపండితులను సైతం ఔరా అనిపించిన రాజకీయ చతురుడు.నాటి వాజ్ పేయి యన్ డిఏ సంకీర్ణ  ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖా మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంథ్రప్రదేశ్ కు అనేక ప్రాజెక్టులు అందించారు.ముఖ్యంగా ఉత్తరాంథ్ర అభివృద్దికి నూతన బాటలు వేశారు.నేడు రాజకీయ రంగంలో రాణిస్తున్న అనేక మంది రాజకీయ నాయకులు ఆయన మార్గదర్శకత్వంలోనే రాటుదేలారు అంటే అతిశయోక్తి కాదు.

స్వర్గీయ కింజారపు ఎర్రంన్నాయుడు ది23-02-1957 లో శ్రీకాకుళం జిల్లా ,కోటబొమ్మాళి మండలం ,"నిమ్మాడ" అనే గ్రామంలో దివంగత దాలినాయడు కళావతమ్మ లకు ఏడుగురు సంతానంలో పెద్దకొడుకుగా జన్మించారు.ఆంథ్రవిశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు.నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982లో స్దాపించి ప్రభంజనం సృష్టించిన పార్టీలో చేరి తుది శ్వాస వరకు ఆ పార్టీ ఆశయాలు,సిద్థాంతాలను బలంగా ప్రజలలోనికి తీసుకెళ్ళారు.అధికారంతో సంబంధం లేకుండా పాపులర్ పీపుల్స్ లీడర్ గా ప్రజా హృదయాలలో స్థిరస్థాయిగా నిలచిపోయారు.భార్య శ్రీమతి విజయకుమారి సౌమ్యురాలు పార్టీ కార్యకర్తలను,అనుచరులను ఎర్రన్న సైన్యాన్ని ఆదరించడంలో మహోన్నతురాలు.ఇరువురు బిడ్డలు వారి రాజకీయ వారసత్వంగా వచ్చినా స్వంత ఇమేజ్ తో తమకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకున్నారు.కుమారుడు యువసంచలనం శ్రీ కింజారపు రామ్మోహననాయుడు 2014,2019 లలో శ్రీకాకుళం పార్లమెంట్ నుండి గెలిచి  పదునైన వ్యాఖ్యలతో వాడి వేడి చర్చలు జరపడంలో దిట్టగా పేరు పొందారు.తెలుగు,ఇంగ్లీషు,హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడుతూ లోకసభలో సమస్యలను లేవనెత్తడంలో తండ్రికి తగిన తనయుడిగా పెను సంచలనం సృష్టిస్తున్నారు.కుమార్తె శ్రీమతి ఆదిరెడ్డి భవాని విపత్కర పరిస్థితులలో కూడా రాజమహేంద్రవరం అర్భన్ నుండి అధిక మెజారిటితో విజయ దుంధుభి మ్రోగించి  ఆంథ్రప్రదేశ్ రెండో శాసనసభకు ఆరంగ్రేటం చేసి ప్రాతినిథ్యం వహిస్తూ చర్చలలో తండ్రికి తగిన తనయగా లాండ్ మార్క్ సాధించారు.సోదరుడు అచ్చెన్నాయుడు వారు నమ్మిన పార్టీకి నేడు ఆంథ్రప్రదేశ్ కు అధ్యక్షుడిగా ఎదిగారు.మరో సోదరుడు కింజారపు ప్రభాకర్ గారు పోలీస్ శాఖలో ఆఫీసర్ గా ఉన్నత హోదాలో ఉంటూ సాధారణప్రజలకు సైతం అందుబాటులో ఉంటారు.

ఉజ్వలమైన రాజకీయభవిత కలిగి,రాజకీయాలలో ఉచ్ఛదశలో ఉన్న సందర్భంలో 55ఏళ్ళ చిన్నవయస్సులోనే ది02-09-2012 న జాతీయరహదారిపై రణస్థలం వద్ద జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో స్వంతవాహనంలోనే అశువులు భాశారు.మహనీయులు తక్కువకాలం జీవిస్తారు ఎక్కువకాలం ప్రజాహృదయిలలో సమాజంలో ఉంటారు అనే నానుడి ఎర్రంన్నాయుడి కి సరిపోతుంది.శ్రీకాకుళం పార్లమెంట్ కు 1980 వరకు వరుసగా ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నాయుడు వేసిన అభివృద్థి బాటను కొనసాగిస్తూ అనన్యసామాన్యమైన పథకాలు శ్రీకాకుళంనకు అందించడంలో కృతకృత్యులయ్యారు.ఎర్రంనాయుడు స్ఫూర్తిదాయకమైన మాస్ లీడర్ .నిరంతరం ప్రజలతో మమేకం.జనం కొరకు పరితపించి వారి మన్ననలు పొంది నేడు వారి ఏర్పరచిన రాజకీయ ఫ్లాట్ ఫారమ్ పై తమదైన శైలిలో రాణిస్తున్నారు.ఆంథ్రప్రదేశ్ ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు స్వర్గీయ కింజారపు ఎర్రం న్నాయుడి 65వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

Post a Comment

0 Comments