GET MORE DETAILS

జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది ?

జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది ?



మనిషి జ్ఞానానికి, దంతానికి అసలు సంబంధమే లేదు. మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. కింది, పై దవడల్లో కుడి వైపు 8, ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి. ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్లు, ఒక కోరపన్ను(canine tooth), 2 అగ్రచర్వణ కాలు(premolars), 3 చర్వణకాలు(Molars) ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా లోపల ఉండే మూడవ చర్వణకాన్ని (3rd molar) జ్ఞాన దంతమని పిలుస్తారు. 

ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లుతో ఉండేది.. కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి, లోపలి చర్వణకానికి స్థానం ఇరుకైంది. ఈ దంతం సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వస్తుంది. ఇరుకు దవడలో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగుతుంది. 

 అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యలో మార్పువచ్చి అసలు జ్ఞానదంతాలే ఏర్పడకపోవచ్చునన్నది ఓ ఊహ. బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది, ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.

Post a Comment

0 Comments