GET MORE DETAILS

విప్లవ శిఖరం చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు

బ్రిటీషర్లకు సింహస్వప్నం , విప్లవ శిఖరం చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు



ప్రస్తుతం మనదేశంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు.ఇటువంటి సమయంలో దేశ కోసం త్యాగం చేసిన గొప్ప వారిని స్మరించుకోవాలి.

అది 1921 సంవత్సరం..భారతదేశం మొత్తం గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంతో అట్టడికిపోతుంది.గాంధీజీ ఉపన్యాసం విని ఒక అబ్బాయి స్వతంత్రపోరాటంలో పాల్గొనాలని తలచి తన స్కూల్ ముందే ధర్నా నిర్వహించి ,వందేమాతరం అంటూ నినాదాలిచ్చాడు, పోలీసులు అతనిని అరెష్ట్ చేసి జడ్జి ముందు నిలబెట్టారు.

 నీ పేరేమిటి ? జడ్జి బాలుని అడిగాడు ? అజాద్ అన్నాడా పిల్లాడు. మీ ఊరు ? స్వాతంత్రం.. నీ నివాసం ఎక్కడ ? జైలు బాలుని సమాధానం.

జడ్జికి కోపం వచ్చి 15రోజులు జైలు శిక్షవేశాడు...మళ్ళీ ఏమనుకొన్నాడో ఏమో  జైలు శిక్షను 15 కొరడా దెబ్బలుగా మార్చాడు..నవ్వుతూ కొరడా దెబ్బలను తింటున్న బాలుని చూసి జనం ఆవేశంతో వందేమాతరం అంటూ ఆవేశంతో నినదించసాగారు...అప్పటికి ఆ అబ్బాయి వయసు 15 సంవత్సరాలు మాత్రమే...ఆ అబ్బాయి పేరు అప్పటి నుండి "అజాద్ "గా స్థిరపడిపోయింది...అతనే చంద్రశేఖర్ సీతారాం తివారీ ఉరఫ్ చంద్రశేఖర్ అజాద్. 

భారతదేశం మరవలేని స్వాతంత్ర విప్లవయోధుడు :

 సహాయనిరాకరణ ఉద్యమం ఆపివేయడం,,లాలాలజపతిరాయ్ ని స్కౌట్ విచక్షణారహితంగా కొట్టడం చూసిన చంద్రశేఖర్ అజాద్ అహింసా మార్గం పనికి రాదని విప్లవమార్గం వైపు మళ్ళాడు. పండితరాంప్రసాద్ ,అష్ఫకుల్లాఖాన్ ,సర్థార్ రోహన్ సింగ్ ,రాజేంద్రలహిరి,భగత్ సింగ్ ,సుఖదేవ్ లతో కలిసి హిందూస్తాన్ సోషలిష్టు సంఘ్ ను స్థాపించాడు.1924 లో రాంప్రసాద్ ,రోహన్ సింగ్ ,అష్పకుల్లాఖాన్ ,రాజేంద్రలహరిలతో కలిసి కకోరి రైల్ దోపిడీలో పాల్గొన్నాడు.ఈ కేసులో ఆంగ్లేయులు అందరినీ అరెష్ట్ చేయగా "అజాద్ "ను మాత్రంపట్టుకోలేకపోయింది. చంద్రశేఖర్ అజాద్ చాలా తెలివిగా తప్పించుకొనేవాడు. 

1927లో నౌ జవాన్ సభ,హిందూస్తాన్ సోషలిష్టు సమాజ్ !న్యూ కిసాన్ సభ అనే సంస్థలను భగత్ సింగ్ ,సుఖదేవ్ ,రాజ్ గురు మొదలగువారితో కలిసి స్థాపించాడు..యువకులను విప్లవంవైపు ఆకర్షింపచేయసాగాడు,, లాలాలజపతిరాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే పోలీసాఫీసర్ ని చంపాలని పథకం రచించాడు, భగత్ సింగ్ రాజ్ గురు ,సుఖదేవ్ ,గోపాల్ తో పాటు తానూ పాల్గొన్నాడు...అయితే స్కాట్ అనుకొని స్కాండర్ అనే పోలీసును చంపారు. స్కాండర్ ను కాల్చి పారిపోతున్న భగత్ సింగ్ ,సుఖదేవ్ లను చనన్ సింగ్ అనే హెడ్ కానిష్టేబుల్ పట్టుకోగా వారిని కాపాడేందుకు విధిలేని పరిస్థితులలో అజాద్ అతనిని చంపి వీరిని తీసుకొని మాయమైనాడు.

 భగత్ సింగ్ లాహోర్ బాంబు పథకాన్ని అజాద్ తీవ్రంగా వ్యతిరేఖించాడు, ఆంగ్లేయులు అంత సహృదయులు కాదని, మన సమస్యను ప్రపంచదృష్టికి తీసుకెళ్ళాలంటే ఇంకా కొన్నిరోజులు ఆగాలని..అప్పటి వరకు ఆగాలని భగత్ ను అనునయించాడు. అయితే అజాద్ లేని సమయం చూసి భగత్ సింగ్ లాహోర్ కోర్టులో బాంబులేసి పోలీసులకు లొంగిపోయాడు..అతనితో పాటు రాజ్ గురు,సుఖదేవ్ ,గోపాల్ లకు ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇది విని అజాద్ హతాసుడైనాడు..జిన్నాతో పాటు కొంతమంది జాతీయనాయకులను కలిశాడు..1931 ఫిబ్రవరి 27 రాత్రి 2 గంటలప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూగారిని కలిసి భగత్ అమాయకుడని,ఆవేశంలో అలా చేసాడేగానీ చంపాలన్న ఉద్దేశం లేదనీ ,అతనిని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డాడు. అయితే నెహ్రూ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నిరాశగా ఆల్ ఫ్రెడ్ పార్క్ కు వచ్చి,అందుబాటులోని విప్లవకారులను హాజరవ్వమనీ,ఎలాగైనా భగత్ సింగ్ కాపాడుకోవాలనీ కబురుపంపారు.. ఉదయం ఒక చెట్టు కు ఆనుకొని కుర్చొని వచ్చిన వారితో మాట్లాడుతున్న అజాద్ కు ఎందుకో అనుమానం వచ్చింది..వెంటనే తన అనుచరుడు సుఖదేవ్ రాజ్ ను అప్రమత్తం చేస్తూ తన రివాల్వార్ తో కాల్పులు మొదలుపెట్టాడు..ముగ్గురు పోలీసులు నేలకొరిగారు కానీ ముందే ఫక్కా వ్యూహంతో వున్న పోలీసులు అతనిని చుట్టుముట్టారు..లార్డ్ బాంట్ ,విశ్వేశ్వరసేన్ ఆజాద్ పై కాల్పులు జరుపుతూ అతని కుడితొడను గాయపరిచారు. అజాద్ బాంట్ ను కాల్చి అక్కడ నుండి తప్పించుకోవాలని చూడగానే విశ్వేశ్వరన్ ప్రతిఘటించసాగాడు..ఆ సమయంలోనూ సహచరుడు సుఖదేవ్ రాజ్ ను కాపాడి అక్కడ నుండి తప్పించాడు.చివరికి తనను చుట్టుముట్టుతున్న పోలీసులకు పట్టుపడకూడదనుకొంటూ..చివరి బుల్లెట్ వున్న  తన రివాల్వార్ ను తన కణితకు గురిపెట్టుకొని కాల్చుకొని కుప్పకూలిపోయాడు.. అప్పుడు అతని వయసు కేవలం 25 సం" మాత్రమే,,,ఎవరినైతే కాపాడాలనుకొన్నాడో ఆ భగత్ ను 20 రోజుల తర్వాత ఉరితీశారు.

చంద్రశేఖర్ అజాద్ గొప్ప దేశభక్తుడు. ఈ రోజు ఆయన వీర మరణం పొందిన రోజు.ఆత్మాభిమానాకి మారుపేరుగా ఆజాద్ నిలిచారు.

Post a Comment

0 Comments